Homeఎంటర్టైన్మెంట్Virata Parvam Collections: విరాట పర్వం మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని అద్భుతం ఇది

Virata Parvam Collections: విరాట పర్వం మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని అద్భుతం ఇది

Virata Parvam Collections: దగ్గుపాటి రానా హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం..గత ఏడాది ఏప్రిల్ 13 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కి ఎవ్వరు ఊహించని విధంగా మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది..మన సమాజం లో జరిగిన ఒక్క నిజమైన యదార్ధ సంఘటన ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Virata Parvam Collections
rana sai pallavi

.ముఖ్యంగా లీడ్ పెయిర్ రానా దగ్గుపాటి మరియు సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసారు..అందరూ హీరోలు లాగ మాస్ మసాలా సినిమాలు చెయ్యకుండా తన అభిరుచికి తగట్టు గొప్ప సినిమాలు తీసే రానా నుండి మరో అద్భుతమైన దృశ్య కావ్యం వచ్చింది..ఈ చిత్రం ఆయన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక ఈ సినిమా మొదటి రోజు వసూలు ఏ స్థాయిలో ఉన్నాయి..ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..? ఎంత వసూళ్లను రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Also Read: Siddu Jonnalagadda DJ Tillu Sequel: డబుల్ బ్లాక్ బస్టర్… డీజే టిల్లు 2 వచ్చేస్తుంది!

లాక్ డౌన్ టైం లో సురేష్ బాబు నిర్మించిన నారప్ప మరియు దృశ్యం 2 వంటి సినిమాలను నేరుగా OTT లో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..విరాట పర్వం కూడా ఆయన ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కిన సినిమా కావడం తో ఈ మూవీ ని నేరుగా OTT లో వదిలితే భారీ మొత్తం మీద ఫాన్సీ అమౌంట్ ఇస్తాము అని చాలా మంది ముందుకు వచ్చారు..కానీ సురేష్ బాబు ఈ సినిమా ని OTT కి ఇవ్వడానికి ఏ మాత్రం కూడా ఆసక్తి చూపలేదు..ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ మీద ఆయనకీ ఉన్న నమ్మకం అలాంటిది..థియేటర్స్ లో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతుందని సురేష్ బాబు బలంగా విశ్వాసం ఉంచారు.

Virata Parvam Collections
rana sai pallavi

.ఈరోజు ఆయన ఈ సినిమా మీద పెట్టిన నమ్మకం ఎలాంటిదో మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తే అర్థమైపోతుంది..ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం మొదటి రోజు అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..మొదటి నుండి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచంబాలు లేవు కాబట్టి నూన్ షోస్ బాగా వీక్ గా ఉన్నాయి..కానీ మంచి టాక్ రావడం తో మాట్నీస్ నుండి కలెక్షన్స్ ఊపందుకున్నాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంత వరుకు అందుకుంటుందో చూడాలి.

Also Read:Case Filed Against Sai Pallavi: సాయిపల్లవిపై కేసు.. రంగంలోకి హిందుత్వ సంఘాలు.. వదిలేలా లేవే!
Recommended Videos
Virata Parvam Movie 1st Day Collections || Virata Parvam Movie Collections || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

Exit mobile version