Ante Sundaraniki Collections: అక్కడ హిట్ ఇక్కడ ఫట్… అంటే సుందరానికీ మిక్స్డ్ రిజల్ట్!

Ante Sundaraniki Collections: హీరో నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. కామెడీ రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ దక్కించుకున్న అంటే సుందరానికీ … కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. మొదటి వారం ముగిసే నాటికి అంటే సుందరానికీ రూ. 18 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 31 కోట్లు రాబట్టాలి. దారుణమైన ఓపెనింగ్స్ దక్కించుకున్న […]

Written By: Shiva, Updated On : June 17, 2022 12:50 pm
Follow us on

Ante Sundaraniki Collections: హీరో నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. కామెడీ రొమాంటిక్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ దక్కించుకున్న అంటే సుందరానికీ … కలెక్షన్స్ పరంగా నిరాశపరిచింది. మొదటి వారం ముగిసే నాటికి అంటే సుందరానికీ రూ. 18 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 31 కోట్లు రాబట్టాలి. దారుణమైన ఓపెనింగ్స్ దక్కించుకున్న అంటే సుందరానికీ మండే తర్వాత మరింత డల్ అయ్యింది. నాలుగో రోజు నుండి భారీ డ్రాప్ కనిపించింది.

Ante Sundaraniki Collections

ఇక ఏపీ/తెలంగాణాలో కలిపి ఫస్ట్ వీక్ అంటే సుందరానికీ రూ. 11.63 కోట్ల షేర్, 19.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 50 శాతం కూడా రికవరీ సాధించలేదు. ఇక నేడు కొత్త సినిమాల విడుదలతో అంటే సుందరానికీ వసూళ్ళు మరింత తగ్గనున్నాయి. నైజాంలో రూ. 10 కోట్లకు అమ్మితే వచ్చింది మాత్రం ఐదు కోట్లు. మొత్తంగా ఏపీ/ తెలంగాణాలో అంటే సుందరానికీ డిజాస్టర్ అని చెప్పాలి. అయితే ఈ మూవీ ఓవర్సీస్ లో హిట్ కావడం విశేషం.

Also Read: Virata Parvam Collections: విరాట పర్వం మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని అద్భుతం ఇది

నానికి యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది. అంటే సుందరానికీ యూఎస్ కలెక్షన్స్ మెరుగ్గా ఉన్నాయి. వన్ మిలియన్ వసూళ్లు దాటేసిన ఈ చిత్రం ఓవర్సీస్ లో రూ. 5.05 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన అంటే సుందరానికీ లాభాలు పంచుతుంది. డొమెస్టిక్ గా ఫెయిల్ అయిన అంటే సుందరానికీ ఓవర్సీస్ లో హిట్ సొంతం చేసుకొని నానికి ఊరటనిచ్చింది. ఆ విధంగా అంటే సుందరానికీ నిర్మాతలకు మిక్స్డ్ రిజల్ట్ అందించింది.

Ante Sundaraniki Collections

బ్రోచేవారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ అంటే సుందరానికీ చిత్రం తెరకెక్కించారు. నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. రోహిణి, నరేష్, నదియా కీలక రోల్స్ చేశారు. జూన్ 10న అంటే సుందరానికీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం నాని దసరా మూవీలో నటిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఫేమ్ మున్నాతో ఓ మూవీకి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:Renuka Chowdhury: రేణుకా చౌదరి నోటికి, చెయ్యికి ఎప్పుడూ పదునే

Tags