మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమాని చూసి భయపడుతున్నాడట. పైగా ఒకప్పుడు మనసు పడ్డ ఆ కథ ఇప్పుడు చిరును ఇబ్బంది పెడుతుందట. రీమేక్ రైట్స్ అయితే ఆల్ రెడీ కొనేశారు. పైగా డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారు, స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించేశారు. ఇప్పుడు ఉన్నట్టు ఉండి సినిమా చెయ్యను అంటే ఎలా ? ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్‘ సినిమా గురించే ఇదంతా. సినిమాలో పొలిటికల్ వాసనలు ఉండటం, పైగా మెగాస్టార్ పాత్ర తాలుకు ఎమోషన్ కాస్త తెలుగు నేటివిటికి దూరంగా ఉండటం వంటివి చిరును భయపెడుతున్నాయి. నిజానికి అలాంటి అంశాల పై ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించారు.
వైజయంతీ మూవీస్ తదుపరి చిత్రంలో ప్రభాస్ జోడీగా దీపికా !
కానీ రాజకీయ నేపథ్యంలో వచ్చే సీన్స్ ప్లేస్ లో వేరే సీన్స్ పెట్టే అవకాశం లేదట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలను టచ్ చేయడం ఎందుకు అని భయపడుతున్నాడు చిరు. అయితే సినిమా క్యాన్సల్ అయిందని వస్తోన్న వార్తల్లో మాత్రం ఎలాంటి వాస్తవం లేదట. చిరు ఈ సినిమా చేయడం పక్కా అని కాకపోతే స్క్రిప్ట్ లో తప్పనిసరిగా మార్పులు ఉంటాయని సమాచారం. ఇక ఇప్పటికే క్యాస్టింగ్ విషయంలో భారీగానే ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది కావడంతో ఆ పాత్రలో బన్నీని నటింపజేయాలనుకుంటున్నారు. ఎలాగూ బన్నీ కూడా మెగాస్టార్ తో నటించడానికి ఆసక్తి చూపుతాడు.
హాట్ నెస్ తో హీట్ పుట్టిస్తోన్న స్టన్నింగ్ బ్లాక్ బ్యూటీ
ఒకవేళ బన్నీకి బదులు మరొకర్ని ఆలోచించాలనుకుంటే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను మెగాస్టార్ అనుచరుడిగా ఫిక్స్ చేస్తారట. నిజానికి బన్నీ కంటే కూడా విజయ్ దేవరకొండకే ఆ పాత్ర బాగుంటుంది. ఇక ఈ రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. సుజీత్ ఇప్పటికే తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోయిజమ్ కి సంబధించిన సీన్స్ ను బాగా రాసుకున్నాడట. ప్రస్తుతం రైటర్ సాయి మాధవ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.