https://oktelugu.com/

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చింది. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ […]

Written By: , Updated On : April 3, 2020 / 06:49 PM IST
Follow us on


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చింది. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ చేశారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందిని తెచ్చారు. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా ఏపీ ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి చేర్చింది. మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ను ప్రభుత్వం ఎస్మా పరిధిలోకి తెచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగితుండటంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 161 పెరగడంతో పాటు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితుడి తొలిమరణం చోటు చేసుకుంది.