https://oktelugu.com/

కోవిడ్ ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు!

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు అస్సలు అమలు కావడం లేదు. కరోనా బారిన పడ్డ రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే.. లక్షల్లో బిల్లుల మోత మోగుతోంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు గళమెత్తాయి. నెట్టింట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా చికిత్సల కోసం గత నెలలో ప్రైవేట్‌ కి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. ఐసీఎంఆర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 4:13 pm
    Follow us on

    Private hospitals

    రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు అస్సలు అమలు కావడం లేదు. కరోనా బారిన పడ్డ రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే.. లక్షల్లో బిల్లుల మోత మోగుతోంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు గళమెత్తాయి. నెట్టింట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    కరోనా చికిత్సల కోసం గత నెలలో ప్రైవేట్‌ కి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. ఐసీఎంఆర్ గైడ్‌ లైన్స్ పాటించే ఆస్పత్రుల్లో వైద్యుల సూచనల మేరకే కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న రోగులకు పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు

    తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన సర్కులర్ :-

    గత జూన్ 15న తెలంగాణ ప్రభుత్వము ఓ సర్క్యులర్ విడుదల చేసింది. కరోనా టెస్టులకు ఫీజు రూ.2,200గా నిర్ణయించారు. ఇంటికి వచ్చి పరీక్షిస్తే రూ.2800. అలాగే కరోనా రోగులకు వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రోజుకు రూ. 7,500, ఐసోలేషన్‌ లో ఉంచితే రోజుకు రూ.4,000, వెంటిలేటర్‌ పై ఉన్న వారికి రోజుకు రూ. 9,000 చార్జి వసూలు చేయవచ్చని ఆ సర్క్యులర్‌ లో పేర్కొంది. అయితే యాంటి వైరల్ డ్రగ్ అవసరమైతే సపరేట్ చార్జీలు వసూలు చేయవచ్చని తెలిపింది. అయితే ఫీజుల అమలు బాధ్యతను మాత్రం గాలికొదిలేసి కోవిద్ కాలాన్ని క్యాష్ చేసుకుందేకే మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బాధితులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు గర్హనీయమని ఖండిస్తున్నారు.