ఏపీలో రూ.200కోట్ల వసూళ్ల కలకలం?

10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు..? అవురావురు మంటూ ఉన్నట్టున్నారు.? ఇదే అదునుగా దోచేశారా? అంటే ఔననే అంటున్నారు కార్మిక సంఘాలు.. నిరుద్యోగులు.. అందుకే ఏపీ సీఎం జగన్ ఎంత పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ముందుకెళ్తున్నా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. తాజాగా ఏపీలో ఎమ్మెల్యేలపై రూ.200 కోట్ల వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో ఎమ్మెల్యేలు ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10లక్షల చొప్పున 5వేల మంది నుంచి […]

Written By: NARESH, Updated On : July 20, 2020 4:21 pm
Follow us on


10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు..? అవురావురు మంటూ ఉన్నట్టున్నారు.? ఇదే అదునుగా దోచేశారా? అంటే ఔననే అంటున్నారు కార్మిక సంఘాలు.. నిరుద్యోగులు.. అందుకే ఏపీ సీఎం జగన్ ఎంత పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ముందుకెళ్తున్నా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. తాజాగా ఏపీలో ఎమ్మెల్యేలపై రూ.200 కోట్ల వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఏపీలో ఎమ్మెల్యేలు ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10లక్షల చొప్పున 5వేల మంది నుంచి రూ.200కోట్ల వసూళ్లు చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.

Also read:- కరోనా వేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు?

ఏపీలో ఇటీవలే విద్యుత్ శాఖలో 12000 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యాయి. అయితే పర్మినెంట్ అవుతుందని.. జీతాలు బాగా ఉండడంతో చాలా మంది నిరుద్యోగుల నుంచి వీటికి డిమాండ్ ఏర్పడింది.

దీంతో కొందరు ఎమ్మెల్యేలు ఈ ఒక్కో పోస్టును పైరవీలతో రూ.10లక్షలకు నిరుద్యోగులకు అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. 5వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని అంటున్నారు. మొత్తం రూ.200 కోట్ల వరకు ఈ వసూళ్లు జరిగాయనే ప్రచారం కలకలం రేపుతోంది.

ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు 10లక్షల చొప్పున రూ.200కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. ఈ విషయం సీఎం జగన్ కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని అప్పట్లో ఆదేశించారు.

Also read:- సోషల్ మీడియాలోనే తెలుగు తమ్ముళ్ల ఆరాటం..!

ఆరోపణలు రావడంతో ఏపీ సీఎం జగన్ ఈ కాంట్రాక్టు పోస్టులను రద్దు చేశారు. వాటి నియామకాలను ఆపు చేశారు. దీంతో నిరుద్యోగులు ఇప్పుడు ఎమ్మెల్యేల వెంట పడుతున్నారట.. తమ పది లక్షలు అయినా ఇవ్వండి లేదంటే ఉద్యోగాలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.. ఒత్తిడి ఎక్కువ కావడంతో తాజాగా నెల్లూరులో 15మంది ఆపరేటర్లను తొలగించి కొత్తవారిని నియమించారు. ఇది వివాదాస్పదమైంది. సీఐటీయూ, తీసేసిన ఉద్యోగులు ఆందోళన చేయడంతో ఈ వసూళ్ల బాగోతం బయటపడింది.