https://oktelugu.com/

Private Hospitals : శవాల మీద పేలాలు ఏరుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు

Private Hospitals : చిరంజీవి ఠాగూర్ సినిమాలో చచ్చిన శవానికి బతికున్నాడని చెప్పి లక్షలు వసూలు చేసిన కార్పొరేట్ ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల ధనదాహానికి ప్రజలు చితికిపోతున్నారు. ఇల్లు, ఒళ్లు, ఆస్తులు అమ్మి ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్నారు. అయినా బతికించకుండా ఈ ఆస్పత్రులు శవాల మీద పేలాలు ఏరుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంటున్నాయి. రోడ్డు ప్రమాదంలో రాజేంద్రనగర్ హైదర్ గూడ లోని జర్మన్ టేన్ ఆసుపత్రిలో చేరిన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2023 / 08:59 PM IST
    Follow us on

    Private Hospitals : చిరంజీవి ఠాగూర్ సినిమాలో చచ్చిన శవానికి బతికున్నాడని చెప్పి లక్షలు వసూలు చేసిన కార్పొరేట్ ఉదంతాలు ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల ధనదాహానికి ప్రజలు చితికిపోతున్నారు. ఇల్లు, ఒళ్లు, ఆస్తులు అమ్మి ఆస్పత్రి ఖర్చులు చెల్లిస్తున్నారు. అయినా బతికించకుండా ఈ ఆస్పత్రులు శవాల మీద పేలాలు ఏరుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంటున్నాయి.

    రోడ్డు ప్రమాదంలో రాజేంద్రనగర్ హైదర్ గూడ లోని జర్మన్ టేన్ ఆసుపత్రిలో చేరిన మల్లేష్ అనే వ్యక్తి. 18 రోజుల పాటు చికిత్స అందించి 8 లక్షలు దండుకున్న ఆసుపత్రి వర్గాలు. రాత్రికి రాత్రి రోగి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందంటూ నాటకం. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నిమ్స్ ఆసుపత్రికి తరలింపు.

    మల్లేష్ చికిత్స పొందుతూ మృతి. జర్మన్ టేన్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మల్లేష్ మృతి చెందాటంటూ బంధువుల ఆరోపణ. మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

    నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి వర్గాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన తెలిపారు.

    మల్లేష్ చనిపోయాక డబ్బుల కోసం ఆ ఆస్పత్రి నాటకం ఆడిందా? లేక చికిత్స అందించాక చనిపోయాడా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ ఆస్పత్రుల చర్యలు ఇప్పుడు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి.