Homeఎంటర్టైన్మెంట్RGV Certificate : 37 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకున్న వర్మ... ఎన్ని మార్కులతో...

RGV Certificate : 37 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకున్న వర్మ… ఎన్ని మార్కులతో పాస్ అయ్యాడంటే?

 
RGV Certificate  : దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఓ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ ని తన ప్రసంగంతో అలరించారు. వారికి విలువైన జీవిత సలహాలు ఇచ్చారు. కాగా రామ్ గోపాల్ వర్మ తన ఒరిజినల్ డిగ్రీ ఇంతవరకు తీసుకోలేదట. ఆయనకు ఉద్యోగం చేసే ఆలోచన లేదు. ఈ క్రమంలో ఆయన తన డిగ్రీ సర్టిఫికెట్ యూనివర్సిటీకి వెళ్లి తెచ్చుకోలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వర్మ విచ్చేసిన నేపథ్యంలో… సర్ప్రైజ్ గా ఆయన ఇంజనీరింగ్ ఒరిజినల్ డిగ్రీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. 
 
ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1985లో నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాకు ఉద్యోగం చేసే ఆలోచన లేకపోవడంతో డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోలేదు. 37 ఏళ్ల తర్వాత నా డిగ్రీ చేతికి వచ్చింది. నాగార్జున యూనివర్సిటీకి ధన్యవాదాలు అంటూ… ట్వీట్ చేశారు. అలాగే తన ఓ డీ ఫోటో తీసి పోస్ట్ చేశారు. దాన్ని పరిశీలించగా ఆయనకు సెకండ్ క్లాస్ వచ్చినట్లు తెలుస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ ని వర్మ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు. 
 
వర్మ ఇంజనీరింగ్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లో పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఆయన విజయవాడ నగరంలో చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక వర్గ విభేదాలు చూశారు. పాలిటిక్స్ లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్. విద్యార్థులను పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటారనేవి అధ్యయనం చేశారు. అప్పటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా… శివ మూవీ కథ రాసుకున్నారు. నాగార్జున హీరోగా తెరకెక్కించి వర్మ చరిత్ర సృష్టించారు. అలా మొదలైన వర్మ సినిమా ప్రస్థానం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగే స్థాయికి వెళ్ళింది. 
 

గొప్ప దర్శకుడైన వర్మ లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. క్రియేటివిటీ పక్కన పెట్టి కాంట్రవర్సీని నమ్ముకున్నాడు. ప్రముఖులను బద్నామ్ చేస్తూ సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలనే చీప్ ట్రిక్స్ కి అలవాటు పడ్డారు. ఒకప్పటి వర్మ సినిమాలను తలచుకుంటే ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడకు దిగజారిపోయారనిపిస్తుంది. అయితే వర్మ ఫిలాసఫీ వేరు. ఉన్నన్నాళ్ళు జీవితాన్ని ఆస్వాదించడమే అని నమ్ముతారు. వర్మ జీవన శైలిని ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారు.   

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version