Homeజాతీయ వార్తలుRashmika Mandanna: ప్రధాని కంటపడిన రష్మిక షార్ట్‌ వీడియో.. ఎక్స్‌లో పోస్టు చేసిన మోదీ!

Rashmika Mandanna: ప్రధాని కంటపడిన రష్మిక షార్ట్‌ వీడియో.. ఎక్స్‌లో పోస్టు చేసిన మోదీ!

Rashmika Mandanna: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం సాగుతోంది. మే 20న ఐదో విడత ఎన్నికలు జరుగునున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, లఢక్‌లో మొత్తం 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ విడతలో అమేథీ నుంచి స్మృతి ఇరానీ, రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, బారాముల్ల నుంచి ఒమర్‌ అబ్దుల్లా భవితవ్యం తెలనుంది.

రష్మిక వీడియో..
అటల్‌ సేత వంతెనై రష్మిక ఓ షార్ట్‌ వీడియో షూట్‌ చేశారు. దీనిని తన అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. వీడియోలో ‘భారత్‌.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం చేశారు. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుంది. వికసిత్‌ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోంది. యంగ్‌ ఇండియా.. అన్‌ స్టాపబుల్‌ డెవలప్మెంట్‌ సాధిస్తోందనడానికి ఇదే నిదర్శనమిది. ఇలాంటి అటల్‌ సేతులను ఇంకా చాలా కావాలి. అందుకోసం ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయండి’ అని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల వేళ వీడియో వైరల్‌..
జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా, స్టార్‌ హీరోయిన్, శ్రీవల్లిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న చేసిన ఓ షార్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో నిర్మించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్‌ హార్బర్‌ లింగ్‌ బ్రిడ్జికి సంబంధించి రష్మిక వీడియ చేశారు. భారత్‌లో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జి ఇదే. ముంబైలోని సేవ్రీ నుంచి నౌవాను కనెక్ట్‌ చేస్తూ నిర్మించారు. 22 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను ఏడేళ్లలో కేంద్రం నిర్మించింది. వంతెన నిర్మాణానికి ముందు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 2 గంటలు పట్టేది. ఇప్పుడు 20 నిమిషాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ వంతెన వడాలా, కోలాబా, ముంబై పోర్టు వంటి ప్రాంతాలను కనెక్ట్‌ చేస్తుంది.

వీడియోపై స్పందించిన మోదీ..
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రష్మిక వీడియోపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. రష్మిక వీడియోను మోదీ తన అధికారిక వీడియోలో రీ ట్వీట్‌ చేశారు. ‘దేశ ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉండడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version