AP Election Survey 2024: ఆరా మస్తాన్.. ఈయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఉన్నది ఉన్నట్టు విశ్లేషిస్తారని.. సర్వే ఫలితాలను వెల్లడిస్తారని మంచి పేరు ఉంది. అందుకే ఈసారి ఆరా మస్తాన్ సర్వే కోసం అందరూ ఎదురు చూశారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. విజయం పై అన్ని రాజకీయ పక్షాలు ధీమాతో ఉన్నాయి. సర్వే సంస్థలు సైతం తమ ఫలితాలను వెల్లడించాయి. కొన్ని సర్వేలు వైసిపికి.. మరి కొన్ని సర్వేలు కూటమికి పట్టంకట్టాయి. అయితే తాజాగా ఆరా మస్తాన్ సర్వే విశ్లేషణ అంటూ ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏపీ రాజకీయాలంటేనే కులాల సమాహారం. కులాల మధ్య స్పష్టమైన రాజకీయ విభజన రేఖ ఉంటుంది. ఏపీలో వైసీపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మాల, మాదిగ,ముస్లిం, రెడ్డి వర్గాల మద్దతు ఉందని ఆరా మస్తాన్ విశ్లేషించారు. పురుషులకంటే ఆరు లక్షల మహిళ ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని.. వారిలో ఎక్కువమంది వైసీపీకి మద్దతు తెలిపారని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల అమలు కూడా వైసిపికి కలిసి వస్తుందని తేల్చి చెప్పారు. గట్టి ఫైట్ ఉన్న అంతిమ విజయం వైసీపీ దేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షానికి నష్టమని.. కానీ ఏపీలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఆరా మస్తాన్ అంచనా వేస్తున్నారు.
ఆరా మస్తాన్ తెలంగాణ ఎన్నికలపై జోస్యం చెప్పారు. ఆయన ప్రకటించిన సర్వే ఫలితాలు కూడా నిజమయ్యాయి. ఇప్పుడు ఏపీలో కూడా సరికొత్తగా విశ్లేషించడం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే పెరిగిన ఓటింగ్.. ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకతా తదితర కారణాలతో వైసిపిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. తాజాగా ఆరా మస్తాన్ విశ్లేషణ వారిలో కొత్త ఆశలను రేపుతోంది. తెలంగాణ మాదిరిగా ఆరా మస్తాన్ విశ్లేషణ నిజమవుతుందో.. లేక చతికిల పడుతుందో చూడాలి.