PM Modi: గుజరాత్ రాష్ట్రంలో(Gujarat state) 2002 సంవత్సరంలో జరిగిన గోద్రా అల్లర్లు(Godhra incident) సంచలనం సృష్టించాయి. నాటి ఘటనలో చాలామంది చనిపోయారు. ఆ మారణ హోమం గుజరాత్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అలాంటి ఘటన తర్వాత కూడా బిజెపి(Bhartiya Janata party) గుజరాత్ రాష్ట్రంలో(Gujarat state) ఎన్నికల్లో గెలిచింది. నరేంద్ర మోడీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు.
వాస్తవానికి ఇలాంటి ఘటన మరో రాష్ట్రంలో జరిగి ఉంటే అధికార పార్టీ కచ్చితంగా ఓడిపోయేది. ప్రజలు ఇచ్చిన తీర్పు ముందు తలవంచుకునేది. కానీ నరేంద్ర మోడీ(Narendra Modi) ఆధ్వర్యంలో బిజెపి ధైర్యంగా నిలబడగలిగింది. గుజరాత్ ప్రజల తీర్పును తనకు అనుకూలంగా మలుచుకుంది. అయితే నేటికీ కూడా గోద్రా అల్లర్లను(Godhra incident) కాంగ్రెస్ లాంటి పార్టీలు ప్రస్తావిస్తుంటాయి. నాటి మరణ హోమానికి నరేంద్ర మోడీ కారణమని విమర్శిస్తుంటాయి. ఇక మీడియా కూడా అదే కోణంలో వార్తలను, కథనాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. అయితే నాటి ఘటనపై అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఎన్నడూ నోరు విప్పలేదు. అయితే తొలిసారిగా ఈ విషయంపై నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందించారు.
తొలి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ
మీడియాకు దూరంగా ఉంటారు.. మీడియా ప్రతినిధులను దూరంగా పెడతారు అనే అపప్రదను ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తొలిసారిగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు(zerodha co founder) నిఖిల్ కామత్ (Nikhil Kamat) తో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక విషయాలను నరేంద్ర మోడీ పంచుకున్నారు. ” నేను మనిషిని మాత్రమే. భగవంతుడిని అసలు కాదు. నా వరకు వ్యక్తిగతంగా ఎటువంటి తప్పులు చేయలేదు. తప్పులు చేసే ఆస్కారం కూడా లేదు. దేశం మాత్రమే నాకు ముఖ్యం. 2002లో గుజరాత్ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో గోద్రా ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. అప్పుడు కొంతమంది రైలును తగలబెట్టారు. ఆ ఘటనా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.. ఆ సంఘటన గురించి అధికారులు నాకు చెప్పగానే అక్కడికి వెళ్తానని అన్నాను.. అయితే సింగిల్ ఇంజన్ చాపర్ మాత్రమే ఉంది. దీంతో అక్కడికి వెళ్లడానికి నాకు అనుమతి ఇవ్వలేదు. అధికారులతో నేను చాలాసేపు వాదించాను. చివరికి ఏం జరిగినా సరే నేనే బాధ్యుడిని అని చెప్పాను. గోద్రా ప్రాంతంలో జరిగిన దారుణాన్ని తలచుకొని నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. అక్కడ మృతదేహాలను చూసి చలించిపోయాను. కానీ నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి.. నా భావోద్వేగాలను నియంత్రించుకున్నాను. అందువల్లే ఆ ఘటనపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తట్టుకున్నానని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ప్రారంభంలో నిఖిల్ కామత్ సరదాగా మాట్లాడారు. నేను తొలిసారి మిమ్మల్ని పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నానని నిఖిల్ అనగానే.. నరేంద్ర మోడీ నవ్వుతూ.. నాక్కూడా ఇదే తొలి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ అని పేర్కొన్నారు.. దీనిని ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాల్సి ఉందని ప్రధాని అనగానే ఇద్దరూ నవ్వారు.. కాగా ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన టీజర్ ను నిఖిల్ కామత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. దానిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు.. దీనిని మీరంతా ఆస్వాదిస్తారని అనుకుంటున్నానని కామెంట్ చేశారు.
I hope you all enjoy this as much as we enjoyed creating it for you! https://t.co/xth1Vixohn
— Narendra Modi (@narendramodi) January 9, 2025