https://oktelugu.com/

PM Modi: కశ్మీర్‌ పై సంచలన ప్రకటన చేసిన ప్రధాని మోడీ!

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రతినిధి ఇమ్రాన్‌ నబీదార్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర హోదా పునరుద్ధరరిస్తామని మోదీ చేసిన ప్రకటనను స్వాగతించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 22, 2024 / 12:29 PM IST

    PM Modi

    Follow us on

    PM Modi: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు. రెండు రోజుల కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి మోదీ.. రూ.1,500 కోట్ల విలువైన 84 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. శుక్రవారం(జూన్‌ 21) ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ కేంద్ర పాలిత ప్రాంతానికి త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ఉగ్ర దాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటుహక్కు వినియోగించుకున్న కశ్మీర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అడ్డుగోడ తొలగిపోయిందని తెలిపారు. భారత రాజ్యంగం పంసూర్ణంగా అమలవుతుందని పేర్కొన్నారు.

    ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీం..
    ఇదిలా ఉండగా వచ్చే సెప్టెంబర్‌లోగా జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భారత ఎన్నిల సంఘాన్ని ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ కూడా కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో మోదీ కూడా త్వరలో ఎన్నికలు జరుగతాయని చెప్పడంతో జమ్మూకశ్మీర్‌ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే మోదీ ప్రకటనపై నేతల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

    – నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రతినిధి ఇమ్రాన్‌ నబీదార్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర హోదా పునరుద్ధరరిస్తామని మోదీ చేసిన ప్రకటనను స్వాగతించారు. అయితే ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టంగా ప్రకటించాలని కోరారు. రాష్ట్రాన్ని యుటిగా ప్రకటించడాన్ని ఇక్కడి ప్రజలు అంగీకరించలేదని తెలిపారు.

    – మోదీ ప్రకటనపై పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ స్పందించింది.. మోదీ ప్రకటనను మరో జుమ్లాగా అభివర్ణించింది. ఐదేళ్లుగా ఇదే మాట వింటున్నామని తెపింది. విదేశాల నుంచి అవినీతి సొమ్మును వెనక్కి తెప్పించి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న చందంగానే కశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రనకటన ఉందని పీడీపీ యూత్‌వైస్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య గుప్తా విమర్శించారు.

    – అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్‌ బుఖారీ మాట్డాతూ ప్రధాని ప్రకటనతో కశ్మీర్‌ ప్రజలకు ఉత్సాహం తెచ్చిందన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, జమ్మూ – కాశ్మీర్‌ రాష్ట్ర హోదాను తిరిగి పొందుతామని ప్రధాని చేసిన ప్రకటన అత్యంత ముఖ్యమైనది. సమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, వారి స్వంత ప్రతినిధులను ఎన్నుకునే వారి ప్రజాస్వామ్య హక్కు కోసం వాగ్దానం నెరవేరడం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని అల్తాఫ్‌ బుఖారీ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఎక్స్‌లో రాశారు.

    – జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటనను మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ స్వాగతించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోసం తహతహలాడుతున్నారనే విషయాన్ని తెలియజేసిందిన్నారు. ఇది ప్రజల చిరకాల కోరిక, డిమాండ్‌. పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం శాంతిని మరియు ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆ పార్టీ ప్రధాన ప్రతిని«ధి డీపీఏపీ సల్మాన్‌ నిజామీ అన్నారు.

    – కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షేక్‌ అమీర్‌ మాట్లాడుతూ.. తాము చాలా ఏళ్లుగా ఈ పెద్ద వాదనలు వింటున్నామన్నారు. ‘చివరి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జమ్మూ కశ్మీర్‌లో జరిగాయి. ప్రధాని సీరియస్‌గా ఉంటే.. మరింత ఆచరణాత్మకంగా ఉండాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని కోరారు.