https://oktelugu.com/

లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన

కరోనా సెకండ్ వేవ్ తరుముకొస్తున్న వేళ లక్షల కేసులు.. వందల మరణాలు చోటుచేసుకుంటున్న ఈ కీలక తరణంలో ప్రధాని మోడీ దేశంలో కరోనా పరిస్థితులపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు కీలక సూచన చేశారు. దేశాన్ని లాక్ డౌన్ నుంచి మనకు మనమే కాపాడుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే పరిగణించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి కోట్ల మందికి […]

Written By: , Updated On : April 20, 2021 / 09:45 PM IST
Follow us on

కరోనా సెకండ్ వేవ్ తరుముకొస్తున్న వేళ లక్షల కేసులు.. వందల మరణాలు చోటుచేసుకుంటున్న ఈ కీలక తరణంలో ప్రధాని మోడీ దేశంలో కరోనా పరిస్థితులపై జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు కీలక సూచన చేశారు.

దేశాన్ని లాక్ డౌన్ నుంచి మనకు మనమే కాపాడుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే పరిగణించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి దూరమైంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతోందని మోడీ అన్నారు. దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలని మోడీ సూచించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలన్నారు. దేశాన్ని కరోనా నుంచి కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి మోడీ ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఔషధ సంస్థలు మన దేశంలో ఉన్నాయని.. దేశంలో కరోనా ఔషధాల కొరత లేదని మోడీ స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉందని.. సరిపడా ఆక్సిజన్ సరఫరా కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు.

ప్రపంచంలోనే అత్యంత చౌకగా భారత్ వ్యాక్సిన్ అందిస్తోందని మోడీ తెలిపారు. దేశంలో ఆక్సిజన్ పెంచేందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో పడకలు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మన జాగ్రత్తగా ఉంటే మరోసారి లాక్ డౌన్ అవసరం లేదని మోడీ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతుందని మోడీ తెలిపారు. ఇక ముందు కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.