మహేష్ జంగిల్ హీరో: రాజమౌళి కథ ఇదే?

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే మూవీ మహేష్ బాబుతోనే.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే మహేష్ లాంటి అందగాడు.. బాహుబలి తీసిన దర్శకధీరుడు రాజమౌళి కలిస్తే ఇండస్ట్రీ రికార్డులు చెరిగిపోవడం ఖాయం. ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా? అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయాక మహేష్ బాబుతో సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఈ కథ ఎంచుకుంటాడన్నది ఆసక్తిగా మారింది. మహేష్ ను రాజమౌళి […]

Written By: NARESH, Updated On : April 21, 2021 9:13 am
Follow us on

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే మూవీ మహేష్ బాబుతోనే.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే మహేష్ లాంటి అందగాడు.. బాహుబలి తీసిన దర్శకధీరుడు రాజమౌళి కలిస్తే ఇండస్ట్రీ రికార్డులు చెరిగిపోవడం ఖాయం. ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా? అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయాక మహేష్ బాబుతో సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం రాజమౌళి ఈ కథ ఎంచుకుంటాడన్నది ఆసక్తిగా మారింది. మహేష్ ను రాజమౌళి ఎలా చూపిస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.

తాజాగా రాజమౌళి-మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూర్తిగా అడవుల బ్యాక్ డ్రాప్ ఆధారంగా తెరకెక్కనుందట.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే మహేష్ కోసం అడవుల్లో అడ్వెంచర్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం.

ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక దసరాకు లేదా సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సర్కారివారి పాట సినిమా చేస్తున్న మహేష్ దాన్ని వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమాకు రెడీ ఉండాలని యోచిస్తున్నట్టు సమాచారం.