https://oktelugu.com/

బాలికకు కడుపుచూసిన టిక్ టాక్ స్టార్ అరెస్ట్

టిక్ టాక్ మాయలో పడి చాలా మంది వివాహేతర సంబంధాలతో సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఇటీవల బయటపడ్డాయి. ఇక యువత కూడా టిక్ టాక్ తో పాపులర్ అయ్యి ఒకరినొకరు తెలుసుకొని ప్రేమ పేరుతో కట్టుదాటుతున్న వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ బాలికను నమ్మించి మోసం చేసిన ఓ టిక్ టాక్ ఉదంతం వెలుగుచూసింది. విజయనగరం జిల్లా చిప్పాడ వాసి.. టిక్ టాక్ తో పాపులర్ అయిన భార్గవ్ తాజాగా ఓ బాలికకు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2021 / 09:08 PM IST
    Follow us on

    టిక్ టాక్ మాయలో పడి చాలా మంది వివాహేతర సంబంధాలతో సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఇటీవల బయటపడ్డాయి. ఇక యువత కూడా టిక్ టాక్ తో పాపులర్ అయ్యి ఒకరినొకరు తెలుసుకొని ప్రేమ పేరుతో కట్టుదాటుతున్న వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ బాలికను నమ్మించి మోసం చేసిన ఓ టిక్ టాక్ ఉదంతం వెలుగుచూసింది.

    విజయనగరం జిల్లా చిప్పాడ వాసి.. టిక్ టాక్ తో పాపులర్ అయిన భార్గవ్ తాజాగా ఓ బాలికకు కడుపు చేసి ఆమె గర్భం దాల్చేలా చేశాడు. టిక్ టాక్ లో వీడియోలు చేసుకుంటున్న ఆమెను నమ్మించి టీవీ చానెళ్లలో అవకాశాల పేరుతో బాలికతో సాన్నిహిత్యం పెంచుకొని మాయమాటలు చెప్పి లైంగికంగా వాడుకున్నాడు.

    బాలిక తాజాగా గర్భం దాల్చడంతో ఈనెల 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టి హైదరాబాద్ లో ఉన్న భార్గవ్ ను అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

    నిన్న కోర్టులో హాజరుపరుచామని.. మే 3 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.