PM Modi RDI Found: భారత దేశంలో అతిపెద్ద లోపం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. 75 ఏళ్లు దేశాన్ని పాలించిన పాలకులు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.. పరిశోధనల్లో 90 శాతం విఫలం అవుతాయి. దీంతో పెట్టుబడి వృథా అన్న భావనతో డబ్బులు కర్చు చేయలేదు. కానీ అమెరికా, యూరప్ వంటి దేశాలు పరిశోధలనపై ఎక్కువ దృష్టి పెట్టాయి. దీంతో ఇప్పుడు లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. మన దేశంలో పరిశోధనలకు అవకాశం లేకపోవడంతో భారత ప్రతిభ విదేశాలకు వెళ్తోంది. అమెరికా, చైనా లాంటి దేశాలు ప్రభుత్వ సహకారంతో పరిశోధనలను లాభదాయక వ్యాపారాలుగా మార్చుకున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, టెస్లా వంటి విజయవంతమైన సంస్థలు అన్నీ పరిశోధన ప్రాజెక్టుల నుంచే పుట్టాయి.
మోదీ కీలక నిర్ణయం..
దేశంలో పరిశోధన వాతావరణాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ చారిత్రాత్మకంగా లక్ష కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిధులు ప్రైవేటు, ప్రభుత్వ, విద్యాసంస్థల మధ్య సాంకేతిక భాగస్వామ్యానికి మద్దతు ఇస్తాయి. దీని ద్వారా స్వదేశీ ఇన్నోవేషన్‌కి ఆర్థిక రక్షణ లభిస్తుంది. అత్యాధునిక పరిశోధనలకు అవరోధాలు తగ్గితే దేశీయ ప్రతిభ తిరిగి భారత్‌లోనే అవకాశాలు కల్పించుకుంటుంది. ఈ నిర్ణయం శాస్త్రవేత్తల వలస సమస్యను తగ్గించేందుకు ముందడుగుగా భావించవచ్చు. అందులో భాగంగా విద్యా సంస్థల్లో పరిశోధనా హబ్‌లు, ప్రైవేటు కంపెనీలకు పన్ను రాయితీలు లాంటి చర్యలు ప్రోత్సాహకంగా ఉంటాయి.
ప్రభుత్వ ధైర్యం..
పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టడం తక్షణ ఫలితాలను ఇవ్వదు. పది ప్రాజెక్టుల్లో ఒకటి లేదా రెండు మాత్రమే విజయవంతం అవుతాయి. అయినప్పటికీ దీర్ఘకాల దృష్టితో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక సార్వభౌమత్వానికి పునాది వేస్తుంది. మోదీ ప్రభుత్వం ఈ దిశలో చూపిన ధైర్యం భవిష్యత్ భారత్ టెక్నాలజీ శక్తిని నిర్ణయించవచ్చు.
రాబోయే పదేళ్లలో ఈ లక్ష కోట్ల రూపాయల వ్యూహం స్థిరంగా అమలైతే భారత్ పరిశోధనా రంగంలో ప్రపంచ పటంలో నాయకత్వం సాధించే అవకాశం ఉంది. ‘‘ఇన్నోవేషన్ భారత్’’ అనే కొత్త భావనకు ఇది ఆద్యాయం అవుతుంది.