https://oktelugu.com/

Presidential Elections- Jagan: రాష్ట్రపతి ఎన్నికలు.. జగన్ మద్దతు ఎవరికంటే?

Presidential Elections- Jagan: రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరి స్పష్టం చేసింది. విపక్షాలకు మద్దతు ఇష్తారని ఊహించినా వారికి షాకిస్తూ వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు రెండు పార్టీల్లో అభిప్రాయ భేదాలు వచ్చినా సీఎం జగన్ మాత్రం బీజేపీకే సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో వైసీపీ ఎప్పుడైనా బీజేపీ వెంటే ఉంటుందనే నానుడిని నిజం చేస్తూ జగర్ నిర్ణయం తీసుకోవడంలో పెద్ద వింతేమీ లేదని తెలుస్తోంది. ఆపద కాలంలో బీజేపీకి వైసీపీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 24, 2022 4:07 pm
    Follow us on

    Presidential Elections- Jagan: రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరి స్పష్టం చేసింది. విపక్షాలకు మద్దతు ఇష్తారని ఊహించినా వారికి షాకిస్తూ వైసీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు రెండు పార్టీల్లో అభిప్రాయ భేదాలు వచ్చినా సీఎం జగన్ మాత్రం బీజేపీకే సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో వైసీపీ ఎప్పుడైనా బీజేపీ వెంటే ఉంటుందనే నానుడిని నిజం చేస్తూ జగర్ నిర్ణయం తీసుకోవడంలో పెద్ద వింతేమీ లేదని తెలుస్తోంది. ఆపద కాలంలో బీజేపీకి వైసీపీ చేదోడు వాదోడుగానే ఉండటం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైసీపీ బీజేపీని సపోర్టు చేయడం వింతేమీ కాదు.

    Presidential Elections- Jagan

    draupadi murmu, Jagan

    సామాజిక న్యాయం కోణంలో చూస్తే గిరిజన మహిళకు రాష్ట్రపతి పీఠం దక్కడం నిజంగా ఆహ్వానించదగినదే. అందుకే ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అందులోనూ ఒక మహిళ రాష్ట్రపతి పదవి అలంకరించడం నిజంగా ముదావహమే. బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ఎన్నటికి సాధ్యం కాని సామాజిక న్యాయం కోణంలో ద్రౌపది ముర్మును రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రకటించడంతో వైసీపీ కూడా బీజేపీ వెంటే నడవాలని నిర్ణయించుకుంది.

    Also Read: RSS- Maharashtra Political Crisis: ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడ.. ‘మహా’ సంక్షోభంపై అందుకే స్పందించడం లేదా!?

    ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారని అందరు భావించినా తాను వెళ్లడం లేదని తెలిసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి లు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ తన నిర్ణయాన్ని ముందే ప్రకటించడంతో విపక్షాలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కు పార్టీల బలం పెరిగిపోతుందని సమాచారం.

    Presidential Elections- Jagan

    draupadi murmu

    ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ పేచీలు పెట్టి బీజేపీని ఇరుకున పెడతారని అందరు భావించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ వంటి అంశాలపై డిమాండ్లు పెట్టి బీజేపీని ఇబ్బందులకు గురిచేస్తారనే వాదన వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. మొత్తానికి వైసీపీ నిర్ణయం రాజకీయ పక్షాల్లో అలజడి రేపుతోంది. ఎన్నో ఊహించుకున్నా సులువుగా జగన్ బీజేపీకి మద్దతిస్తున్నట్లు చెప్పడంతో కంగుతిన్నారు. బీజేపీకి వైసీపీ బలంతో రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటి అడుగు పడినట్లు అయింది.

    Also Read: KCR National Party: బీజేపీతో ఇప్పుడే వద్దు.. కేసీఆర్ జాతీయ పార్టీ గోవిందా..!

    Tags