Electric Motorcycle: హైదరాబాద్,జూన్: పూణే చెందిన EV స్టార్టప్ Evtric మోటార్స్ దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. సరికొత్త ఫీచర్స్ తో Evtric రైజ్ భారతదేశంలో తయారు చేశారు. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లైనప్‌లో కంపెనీ యాక్సిస్, రైడ్, మైటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో చేరింది. Evtric రైజ్ లో ఎటువంటి ప్రత్యేకతలున్నాయో ఇప్పుడు తెలుసు కుందాం.

Also Read: RSS- Maharashtra Political Crisis: ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ.. ‘మహా’ సంక్షోభంపై అందుకే స్పందించడం లేదా!?
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110కిమీ..
Evtric రైజ్ బెనెల్లీ TNT 25 నాక్‌ఆఫ్ లాగా కనిపిస్తుంది. దీని హెడ్‌లైట్లు, ట్యాంక్ , ట్యాంక్ కౌల్‌లు బెనెల్లీ TNT 25 లేదా బెనెల్లీ TNT 300 డిజైన్‌తో సమానంగా ఉంటాయి. వైపులా ట్రేల్లిస్ ఫ్రేమ్ కూడా ఉంది. మోటార్ సైకిల్ అల్లాయ్ వీల్స్ , ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది. Evtric రైజ్ 2kW BLDC మోటారు ద్వారా శక్తిని పొందుతుంది, ఇది గరిష్టంగా 70kmph వేగంతో మోటార్‌సైకిల్‌కు శక్తినిస్తుంది. ఇది 70V/40Ah లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110కిమీల వరకూ నడుస్తుంది. EV 10A ఛార్జర్‌తో వస్తుంది, ఇది దాదాపు నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మెరుగైన ఛార్జింగ్ భద్రత కోసం ఛార్జర్ ఆటో-కట్ ఫీచర్ కూడా ఉంది.

Evtric మోటార్స్ వ్యవస్థాపకుడు, ఎండీ మనోజ్ పాటిల్ మాట్లాడుతూ “మా సరికొత్త సృష్టి RISE, ‘మేక్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావడం పట్ల మేము సంతోషిస్తున్నాము. Internal Combustion Engines(ICE) నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)కి మారడానికి సంకోచించే కస్టమర్‌లకు బైక్ నిజమైన నాణ్యత అనుభవాన్ని ఇస్తుందని అన్నారు.
Evtric రైజ్ ధర..?
Evtric రైజ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రూ.1,59,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. భారతదేశంలోని 22 నగరాల్లో 125 టచ్‌పాయింట్‌లలో ఈ మోటార్‌సైకిల్ అందుబాటులో ఉంటుంది. రూ. 5,000తో బుక్ చేసుకోవచ్చు. ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో ఉంది.