President vs Supreme Court : సాధారణంగా రాజ్యాంగం ఇచ్చిన నిర్వచనం ప్రకారం రాష్ట్రపతి అంటే ఈ దేశానికి సర్వస్వం. ఒకరకంగా రాష్ట్రపతిని నిలువెత్తు రాజ్యాంగానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుంది. మనదేశంలో వెలువడే ప్రతి ఉత్తర్వు పైన రాష్ట్రపతి సంతకం కచ్చితంగా ఉంటుంది. పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకోకపోయినప్పటికీ.. మనదేశంలో సాగుతున్న పరిపాలన మొత్తం రాష్ట్రపతి కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. మన దేశానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి తో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక మన దేశానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిని డిసైడ్ చేసే రైట్.. దానికి సంబంధించిన అఫీషియల్ గెజిట్ డిక్లేట్ చేసే రైట్ ఇండియన్ ప్రెసిడెంట్ కు ఉంటుంది. అంతేకాదు ఎంతటి గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తులైనైనా సరే.. వారు తప్పులు చేస్తే అభిశంసించి ఆస్థానం నుంచి బయటికి పంపించే అధికారం కూడా మన దేశ పార్లమెంటుకు ఉంటుంది. దానికి ఆమోదముద్ర వేసే హక్కు కూడా రాష్ట్రపతికి ఉంటుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే మన రాజ్యాంగంలో ఎన్నో విశేషాలు.. ఎన్నో విశిష్టమైన నిబంధనలు కనిపిస్తూనే ఉంటాయి.
Also Read : భారత్–పాకిస్థాన్ సీజ్‌ఫైర్.. నేటి ముగియనున్న గడువు.. తర్వాత ఏం జరుగుతుంది?
మన దేశంలో వ్యవస్థలన్నీ అత్యంత కీలకంగా ఉంటాయి. అలాగని ఒక వ్యవస్థ గొప్పది.. ఇంకో వ్యవస్థ తక్కువని రాజ్యాంగం చెప్పలేదు. ఇక మన దేశానికి సంబంధించి ముఖ్యంగా మూడు కీలక వ్యవస్థలు ఉంటాయి. శాసన, న్యాయ, కార్య నిర్వహణ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తాయి. అయితే రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు ఒక అదనపు అధికారం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ఏ నిర్ణయమైనా సరే అమలు జరుగుతున్న తీరును పరిశీలించడం.. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే నేరుగా రంగంలోకి దిగడం.. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి హక్కులు సర్వోన్నత న్యాయస్థానానికి ఉంటాయి. దేశం ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే రాష్ట్రపతి కార్యాలయం న్యాయవ్యవస్థను సంప్రదిస్తుంది. అవసరమైతే ఏవైనా సలహాలు తీసుకుంటుంది.
ఇంతటి దృఢమైన రాజ్యాంగ ఉన్న మనదేశంలో.. నష్టపోగా కొత్త సమస్య ఏర్పడింది. అది కూడా రాజ్యాంగం ఆధారంగానే తలెత్తింది. అదేంటంటే రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించిన నిర్ణయాధికారాల విషయంలో ఒక బార్డర్, టైం పీరియడ్ విధించవచ్చా.. దానిని న్యాయ వ్యవస్థ శాశించగలదా అనేది చర్చకు దారితీస్తోంది. ఇక ఈ విషయం మీద దేశ సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలల కాలంలో.. తన వద్దకు వచ్చిన ఒక దస్త్రాన్ని వెంటనే పూర్తిచేసి పంపాలని డెడ్ లైన్ విధించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో ఆ బిల్లును ఓకే చేసినట్టుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఎప్పుడైతే ప్రధాన న్యాయస్థానం ఆ మాట చెప్పిందో.. రాష్ట్రపతి రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టుకు ఈ విషయంలో ఏకంగా ఒక లెటర్ రాశారు. దీంతో దేశంలో అత్యంత బలవంతమైన రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఇది సంకట పరిస్థితిని తీసుకొచ్చింది.. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన గవర్నర్లు పంపించే బిల్లుల విషయంలో.. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి డెడ్ లైన్ విధిస్తూ సర్వోన్నత నేస్తానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. అంతేకాదు సర్వోన్నత న్యాయస్థానానికి ఏకంగా పద్నాలుగు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు తన అధికార పరిధిని ప్రశ్నించి.. ఏకంగా కాల పరిమితి విధించే స్థాయి సర్వోన్నత న్యాయస్థానానికి ఉందా అని రాష్ట్రపతి ఒక ధర్మ సందేహాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదం సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళింది.. అయితే గవర్నర్లు పంపించే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం లోని 201 అధికరణ ప్రకారం ప్రెసిడెంట్ కు డెడ్ లైన్ విధించింది. అయితే ఈ విషయంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఏకంగా ప్రశ్నావళిని సందిస్తూ మే 13న ఒక లెటర్ రాశారు. కాదు అందులో 143 అధికరణ ప్రకారం గవర్నర్లు, రాష్ట్రపతికి డెడ్లైన్ విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. అధికరణ 201 కింద ఇండియన్ ప్రెసిడెంట్ డిసైడ్ చేసే నాన్ ఆబ్జెక్షన్స్ పై సర్వోన్నత న్యాయస్థానం డిఫరెంట్ వెర్ డిక్ట్స్ ఇచ్చిందని రాష్ట్రపతి గుర్తు చేశారు. దీనిపై లెఫ్ట్ పార్ట్ లతోపాటు, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విమర్శలు చేశారు.. సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్రపతి ఎలా వివరణ కోడతారని వారు ప్రశ్నించారు..
ఒక రకంగా చూస్తే పార్లమెంట్లో ఎలాంటి చట్టం చేయాలనే విషయంపై ఎవరూ జోక్యం చేసుకోలేరు. చేసిన చట్టానికి సంబంధించి ఓకే చెప్పే విషయంలో ప్రెసిడెంట్ రైట్స్ ను క్వశ్చన్ చేయలేరని ఇంటలెక్చువల్స్ అభిప్రాయపడుతున్నారు.. కొన్ని చట్టాలు రాజ్యాంగానికి సంబంధించి అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రజల ప్రయోజనాలకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. అయితే ఇలాంటి చట్టాలను నిలుపు చేయాల్సిన అవసరం ఉంటుందని కొంతమంది అంటుంటే.. అయితే ఒక పకడ్బందీగా డెడ్లైన్ లేకుంటే ప్రజలకు ప్రయోజనాలు దూరమవుతాయని వాదించేవారు కూడా ఉన్నారు.. రాష్ట్రపతి రాసిన లేఖలో.. ఏకంగా ప్రశ్నల పరంపర ఉన్న నేపథ్యంలో.. సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.