Hit3 Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది ఈ చిత్రం. అయితే వీకెండ్ తర్వాత ఈ సినిమా భారీ రేంజ్ వసూళ్లను డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇలా అయితే లాంగ్ రన్ కష్టమే రెండవ వీకెండ్ ముగిసేలోపు క్లోజింగ్ వేసుకోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. సోమవారం, మంగళవారం రోజున డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది ఈ చిత్రం. చూస్తుంటే మరో వారం థియేట్రికల్ రన్ కచ్చితంగా ఉండేలా అనిపిస్తుంది. విడుదలై 13 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : శుభమ్’ కి పెట్టిన బడ్జెట్ 2 కోట్లు..5 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!
12 వ రోజున, అనగా సోమవారం ఈ చిత్రానికి 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 13 వ రోజున 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం ఆరు లక్షల రూపాయిలు మాత్రమే డ్రాప్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. అంటే ఈ శుక్రవారం వరకు ఈ చిత్రం మూడు కోట్ల రూపాయిల షేర్ ని వసూళ్లు చేసే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 17 కోట్ల 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, సీడెడ్ ప్రాంతం నుండి 4 కోట్ల 92 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా నుండి రెండు కోట్ల 74 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 17 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 2 కోట్ల 75 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 2 కోట్ల 47 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 13 రోజుల్లో 39 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 12 కోట్ల 40 లక్షలు, ఇతర బాషల నుండి రెండు కోట్ల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 114 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే దసరా కలెక్షన్స్ ని అధిగమిస్తుంది. గీత గోవిందం రికార్డు ని కొట్టాలంటే మరో 10 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది
Also Read : కోహ్లీ దంపతులు కలిసిన ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..?ఎందుకు ఆయన్ని కలుస్తూ ఉంటారు…