https://oktelugu.com/

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల ఆంతర్యం ఏమిటో కానీ… జై జగన్ అంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆయనకు సరిలేరని అంటున్నారు. సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారని, కరోనాను ధీటుగా ఎదుర్కుంటున్నారని కితాబు ఇస్తున్నారు. కేసీఆర్ కరోనాను కట్టడి చేయడంలో ఫెయిల్ అయితే ఆయన్ని విమర్శిస్తే సరిపోతుంది. అలా కాకుండా జగన్ తో పోల్చుతూ కేసీఆర్ ని విమర్శించాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలియడం లేదు. పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట ఈ పొగడ్తల కార్యక్రమం మొదలుపెట్టగా…మరో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 9, 2020 / 12:46 PM IST
    Follow us on


    తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల ఆంతర్యం ఏమిటో కానీ… జై జగన్ అంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆయనకు సరిలేరని అంటున్నారు. సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారని, కరోనాను ధీటుగా ఎదుర్కుంటున్నారని కితాబు ఇస్తున్నారు. కేసీఆర్ కరోనాను కట్టడి చేయడంలో ఫెయిల్ అయితే ఆయన్ని విమర్శిస్తే సరిపోతుంది. అలా కాకుండా జగన్ తో పోల్చుతూ కేసీఆర్ ని విమర్శించాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలియడం లేదు. పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట ఈ పొగడ్తల కార్యక్రమం మొదలుపెట్టగా…మరో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలలో ఈ ఆకస్మిక మార్పు వెనుక కారణం ఏమిటనేది తెలియదు.

    ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

    వైస్సార్ మరణం అనంతరం ఏర్పడిన గడ్డు పరిస్థితులు, కుర్చీల కుమ్ములాటల తరువాత తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ విభనతో తెలంగాణా రాష్ట్రము ఏర్పడింది. తెలంగాణా ఇవ్వడం వలన ఆంధ్రాలో ఓడినా…తెలంగాణాలో గద్దెనెక్కవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశించింది. ఐతే తెలంగాణా సాధన సెంటిమెంట్ మరియు క్రెడిట్ టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి దక్కడంతో ఆయన అఖండ విజయం సాధించారు. ఇటు ఆంద్రప్రదేశ్ కి ద్రోహం చేసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోగా, ఘోర ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా వైస్సార్ సీపీ ఎదగడంతో కేడర్ అంతా అటు వైపు మళ్లింది.

    2014 ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకున్న టీకాంగ్రెస్, 2018లో టీడీపీతో కూటమి కట్టి మరింత నష్టపోయింది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కేసీఆర్ కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉండి పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ కి హ్యాండిచ్చి కేసీఆర్ పంచన చేరడంతో, కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. ఇక ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగు కాగా అదే పరిస్థితి తెలంగాణలో దాపురించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

    యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

    ఈ నేపథ్యంలో తెలంగాణా కాంగ్రెస్ నేతలు జగన్ ఇమేజ్ ఉపయోగించుకొని అక్కడ కేసీఆర్ కి ధీటుగా ఎదగాలని చూస్తున్నారా అనే అనుమానం రేగుతుంది. జగన్ కాంగ్రెస్ అధిష్ఠానాని వ్యతిరేకించిన తరువాత అనేక మంది సీనియర్ నాయకులు ఆయనపై విమర్శల దాడి చేశారు. కొందరు ఆయనపై ఎటువంటి విమర్శలు చేయలేదు. గత ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్, జగన్ అంగీకరిస్తే 2024లో ఎన్నికలలో వైసీపీ తో పాటు కలిసి పనిచేయాలనుకుంటున్నారనిపిస్తుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా జగన్ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య పొత్తు సాధ్యమయ్యే పనేనా అనేది చూడాలి. దానికి తోడు జగన్ మొదటినుండి పొత్తులకు చాలా దూరం. గెలుపైనా, ఓటమైనా సింగిల్ గా వెళ్లే టైపు. కాబట్టి ఎటూ ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరి జగన్ ఇమేజ్ తో తెలంగాణాలో కేసీఆర్ కి గట్టిపోటీ ఇవ్వాలనేది వారి ఆలోచన కావచ్చు. తెలంగాణాలో కూడా వైసీపీని పునరుద్దరించాలని అనుకుంటున్న జగన్ ఈ డీల్ గురించే అవకాశం కలదు. మొదటి నుండి సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరు సీఎంల మధ్య నీటి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.