Homeజాతీయ వార్తలు​Prashanth Kishore: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ భవిష్యత్తుపై కుండబద్దలు కొట్టిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

​Prashanth Kishore: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ భవిష్యత్తుపై కుండబద్దలు కొట్టిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

​Prashanth Kishore: అరవీర భయంకరమైన బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ బలం సరిపోవడం లేదు. ఇప్పటికే మోడీ ధాటికి రెండు సార్లు కాంగ్రెస్ ఓడిపోయింది. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోశించనుంది. అయితే కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య వేధిస్తోంది. సోనియా వృద్ధాప్యం పార్టీకి శాపమైంది. రాహుల్ గాంధీ కాడి వదిలేశాడు. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడం లేదు. నాయకత్వ బాధ్యత తీసుకునే అవకాశం ఏ వ్యక్తికి లేదు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు రాహుల్ గాంధీపై తన పదునైన విమర్శల దాడి చేశారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
Prashanth Kishore
prashanth kishor rahul gandhi

గత సాయంత్రం ముంబైలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్ చేశారు.  పార్టీ నాయకత్వమనేది దైవదత్త హక్కు కాదని గట్టిగా చెప్పారు. ప్రతిపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలని పిలుపునిచ్చారు. బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ గురువారం చేసిన ట్వీట్‌లో ”బలమైన ప్రతిపక్షానికి కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలం, వేదిక చాలా ముఖ్యమైనవి. కానీ కాంగ్రెస్ నాయకత్వం అనేది ఓ వ్యక్తికిగల దైవదత్త హక్కు కాదు.. మరీ ముఖ్యంగా గడచిన పదేళ్ళలో జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో.. ప్రతిపక్ష నాయకత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలి” అని పేర్కొన్నారు.

Also Read: ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్.. స్వయంగా రంగంలోకి దిగిన DGP మహేందర్ రెడ్డి

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ ప్రచార వ్యూహాలను రచించిన ప్రశాంత్ కిశోర్ మమత బెనర్జీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీపై తరచూ విరుచుకుపడుతున్నారు. మమత బెనర్జీ బుధవారం మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎక్కడుందని ప్రశ్నించారు. యూపీఏ ఉనికిలో లేదన్నారు. రాహుల్ గాంధీపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయన విదేశీ యాత్రలకు వెళ్తుండటాన్ని దుయ్యబట్టారు.

సగం కాలం విదేశాల్లో ఉంటూ ఎవరూ రాజకీయాలు చేయలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు.. అంతకుముందు ఆమె ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ముంబైలో భేటీ అయ్యారు. టీఎంసీని గోవా, మిజోరాం తదితర రాష్ట్రాలకు విస్తరించే వ్యూహాలను ప్రశాంత్ కిశోర్ రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా తదితర శాసన సభలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే..ఈక్రమంలోనే కాంగ్రెస్, రాహుల్ తీరుపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లో లోతైన పాతుకుపోయిన సమస్యలు, నిర్మాణ బలహీనతలను కూడా ప్రముఖ వ్యూహకర్త ఎత్తిచూపారు. లఖింపూర్ ఖేరిలో మరణించిన రైతుల కుటుంబాలను కలుసుకోవడానికి రాహుల్ గాంధీ, అతడి సోదరుడు ప్రియాంక గాంధీ వాద్రా ఎత్తుగడలను విశ్వసించే ఎవరైనా ఆ పార్టీ గెలవదని అర్థమవుతుంది. వారి పాతకాలపు వ్యూహాలు వృథా అని తెలుస్తోంది. అందుకే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పై అసహనం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ నిధుల దాహానికి కేంద్రం బిగ్ షాక్..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version