The central government Shock to AP GOVT: ఏపీ నిధుల ఆకలి తీరడం లేదు. ఎందుకంటే నవరత్నాల నుంచి సంక్షేమం, అభివృద్ధి జగన్ ఇచ్చిన హామీలకు బాగా ఖర్చవుతోంది. ఆ ఖర్చుల్లో పడి నెలనెలా జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వడం లేట్ అవుతోంది. ఇక ప్రతీనెలా నిధుల కోసం ఆర్బీఐ చుట్టూ ఇతర ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతూ అప్పు పుట్టించి సర్ధుబాటుకే జగన్ సర్కార్ కు తలకుమించిన భారం అవుతోంది. అందుకే ఇటీవల వివిధ పథకాల కోసం వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం డిపాజిట్ చేసిన సొమ్మును సైతం వెనక్కి తీసుకున్న దైన్యం కనిపిస్తోంది.
తాజాగా అభయహస్తం పథకం అమలు కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ)తో 2009 అక్టోబర్ 27న జీవిత బీమా సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేసుకుంది.ఏపీ ప్రభుత్వ అభయహస్తం పథకంతో ఇక మీదట తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఎల్ఐసి బహిరంగ ప్రకటన జారీచేసింది.ఆ పథకం కోసం తమ వద్ద ఉన్న 2000 కోట్ల నిధిని(ప్రీమియం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్ములు) ప్రభుత్వం డ్రా చేసేసినందున మా ఒడంబడిక రద్దు అయినట్లుగా ప్రకటనలో పేర్కొంది.
ప్రీమియం డబ్బులు కూడా వాడేసే దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్ఐసీ వైదొలగడంతో ఇప్పుడు అభయహస్తం పథకం అటకెక్కినట్టైంది. ఈ పథకం కింద తన అన్ని పాలసీ, లబ్ధిదారులకు డబ్బుల చెల్లింపులు ఆగిపోనున్నాయి. ఇక నుంచి లబ్ధిదారుల క్లెయిమ్ లు, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లు, భవిష్యత్ లో వచ్చే క్లెయిమ్ లు అన్నింటిని పరిష్కరించడం ఏపీ ప్రభుత్వానికి తలకుమించిన భారం అవుతుంది. దీన్ని అమలు చేయడం జగన్ సర్కార్ కు అసాధ్యం..
Also Read: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ భవిష్యత్తుపై కుండబద్దలు కొట్టిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
ఇప్పటికే ‘అభయహస్తం’ డబ్బులను లాక్కొని ఆ పథకాన్ని నీరుగార్చిన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ..
పంచాయతీలకు సైతం కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం డ్రా చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే ఏపీ ఉన్న నిధులను తీసుకొని ఇతర వాటికి మళ్లించి ఖర్చు చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా కొరఢా ఝలిపించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇవ్వడానికి కొర్రీలు పెట్టింది. మెలికలు పెట్టింది. నేరుగా ప్రభుత్వానికి ఇవ్వకుండా.. పంచాయతీల కోసం ప్రత్యేక ఖాతాలు తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఖాతాలకే జమచేస్తామని తెలిపిన కేంద్రం ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ఏపీసర్కార్ ఇష్టానుసారంగా నిధులు తీసుకుంటుండడంతో ఇలా గట్టి హెచ్చరికలు పంపినట్టైంది.