https://oktelugu.com/

సంక్షేమ పథకాలే కాదు.. ఆధ్యాత్మికంలోనూ పాలుపంచుకోవాలి: జగన్‌కు పీకే టీమ్‌ సూచన

ఏపీలో జగన్‌ అధికారం చేపట్టాక సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయి. దేశంలోనే రికార్డు సృష్టిస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. ఒక వైపు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపడం లేదు. అప్పులు కుప్పలవుతున్నా ప్రభుత్వ పథకాలు, నిధులతో ఓట్ల వర్షం కురిపించే ప్రధాన మార్గంగా సంక్షేమ పథకాలను వైసీపీ ఎంచుకుంది. Also Read: హమ్మయ్యా.. హైదరాబాద్ కు బీజేపీ ఒకటి సాధించింది ప్రభుత్వం ఏటా 50 వేల కోట్ల రూపాయల అప్పులతో సంక్షేమ వితరణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 23, 2021 10:19 am
    Follow us on

    Jagan
    ఏపీలో జగన్‌ అధికారం చేపట్టాక సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్నాయి. దేశంలోనే రికార్డు సృష్టిస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. ఒక వైపు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపడం లేదు. అప్పులు కుప్పలవుతున్నా ప్రభుత్వ పథకాలు, నిధులతో ఓట్ల వర్షం కురిపించే ప్రధాన మార్గంగా సంక్షేమ పథకాలను వైసీపీ ఎంచుకుంది.

    Also Read: హమ్మయ్యా.. హైదరాబాద్ కు బీజేపీ ఒకటి సాధించింది

    ప్రభుత్వం ఏటా 50 వేల కోట్ల రూపాయల అప్పులతో సంక్షేమ వితరణ చేస్తోంది. అయితే.. ఈ డబ్బులు తమ సొమ్మేగా అన్న ఉదాసీన వైఖరి లబ్ధిదారుల్లో చాలామందిలో కనిపిస్తోంది. రూపాయి బియ్యం పథకం వంటి స్కీములను పెద్దగా వినియోగించుకోవడం లేదు. అవి పక్కదారి పడుతున్నాయి. ఖజానాకు గండి పడుతున్నా ఇంతగా సర్కారు ఔదార్యం కనబరుస్తుంటే రావాల్సిన మైలేజీ రావడం లేదు. ఈ అంశంపై తాజాగా ప్రశాంత కిశోర్ టీమ్ తో శాంపిల్ సర్వే చేయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

    సంక్షేమం సంగతి పక్కన పెడితే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న వివాదాలు ముఖ్యమంత్రి ఇమేజ్‌కు ఇబ్బందికరంగా మారినట్లు పీకే టీమ్ గుర్తించింది. బీజేపీ, టీడీపీ మత పరమైన అజెండాను అమలు చేసేందుకు పూనుకోవడంతో సంక్షేమంపై చర్చ సమర్థంగా సాగడం లేదట. ఈ నేపథ్యంలో పీకే టీమ్ కొన్ని ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌ను మేకోవర్ చేయాలనేది ఇందులో ప్రధాన సూచన. ఇటీవల ఆలయాల్లో విగ్రహాల ధ్వంసాల ఘట్టం తర్వాత మతపరమైన అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యాయి. ఈ దాడిని తట్టుకోవాలంటే హిందూ మత భావనలను సైతం ముఖ్యమంత్రి సొంతం చేసుకున్నట్లుగా కనిపించాలనేది పీకే టీమ్ ఇచ్చిన సలహాగా చెబుతున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలనేది ప్రశాంత్ కిశోర్ నిర్దేశం.

    Also Read: ఎన్నికల అక్రమాలు.. పోటెత్తిన ప్రజానీకం

    జిల్లా పర్యటనలు, అభివృద్ధి సమీక్షలు అన్ని సందర్బాల్లోనూ కీలకమైన క్షేత్రాల సందర్శన, ఆలయాల పూజల్లో పాల్గొనడం నిరంతరం సాగించాలని పీకే టీమ్ గైడ్ లైన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారానికి ఒక సారైనా ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారట. దీనిపై మీడియా ద్వారానూ తగిన ప్రచారం కల్పించాలట. ఇటీవల కొందరు మఠాధిపతులు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పీఠాధిపతులకు కూడా అవసరమైన సందర్భాల్లో పెద్దపీట వేయాలనేది మరో సూచన. యజ్ణయాగాదులు, క్రతువులకు ప్రభుత్వ సహకారమే కాకుండా స్వయంగా భాగస్వాములవ్వడం ద్వారా ముఖ్యమంత్రి ఆధ్యాత్మిక వాదిగా ముద్ర వేయించుకోవచ్చుననే భావన బలపడుతోంది. ఇది ప్రశాంత్ కిశోర్ ఆలోచనలనుంచి పుట్టిన ఐడియాగానే పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్