https://oktelugu.com/

వలంటీర్ల విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం. .

వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిగతా సంగతి ఎలాగా ఉన్నా.. కొందరి యువతకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు వాలంటీర్లను నియమించుకున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా కొంతమొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఈ మధ్య కొంతమంది వాలంటీర్లు రోడ్డెక్కారు. తమకు పనిభారం పెరుగతోందని, జీతాలు పెంచాలని ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన జగన్ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు చేసేది సేవా అని ప్రకటించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2021 / 10:03 AM IST
    Follow us on

    వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిగతా సంగతి ఎలాగా ఉన్నా.. కొందరి యువతకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు వాలంటీర్లను నియమించుకున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా కొంతమొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అయితే ఈ మధ్య కొంతమంది వాలంటీర్లు రోడ్డెక్కారు. తమకు పనిభారం పెరుగతోందని, జీతాలు పెంచాలని ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు స్పందించిన జగన్ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు చేసేది సేవా అని ప్రకటించారు. అయితే ఆందోళనలు తగ్గకపోవడంతో ప్రభుత్వం వాలంటీర్లను సముదాయించేందుకు కొత్త వ్యూహం పన్నింది.. అదెంటంటే..?

    Also Read: హమ్మయ్యా.. హైదరాబాద్ కు బీజేపీ ఒకటి సాధించింది

    ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అక్రమాలు నివారించేందుకు వాటిని నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వాలంటీర్లను నియమించింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా దాదాపు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేరుస్తున్న వాలంటీర్లు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో వారికి సీఎం జగన్ ఓ బహిరంగ లేఖ రాశారు.

    నిన్న జరిగిన ప్రణాళిక సమీక్షా సమావేశంలో జగన్ వాలంటీర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏటా ఉగాది రోజు గ్రామ వాలంటీర్లకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ఈ ప్రొత్సాహకం నగదుతో పాటు బహుమతి రూపంలో ఇవ్వనున్నారట. ఈ మేరకు కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారట.

    Also Read: ఎన్నికల అక్రమాలు.. పోటెత్తిన ప్రజానీకం

    నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఉత్తమ వాలంటీర్లను ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సత్కారాలకు సేవారత్న,సేవామాత్ర లాంటి పేర్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామాలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా డేటా క్రోడీకరణ, రైతు భరోసా కేంద్రాల నుంచి ఈ క్రాపింగ్ డేటా సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ డేటా ఆధారంగా పరిపాలన లోపాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవచ్చని జగన్ తెలిపారట.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్