YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుార్తె షర్మిల పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అధికారమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఏడాది పాటు కొనసాగే పాదయాత్రలో చేపట్టబోయే వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయ్యారు. పాదయాత్రలో ఎలాంటి వైఖరులు అవలంభించాలనే దానిపై ఒక అంచనాకు వస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లను ఎదుర్కొనే క్రమంలో మూడు పార్టీలను క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ ఇమేజ్ ను ఓన్ చేసుకోవడానికి ప్రయత్నాలు మమ్మరం చేస్తున్నారు.
వైఎస్సార్ అభిమానులను తమ వైపు తిప్పుకునే క్రమంలో షర్మిల పలు ప్రయత్నాలు చేస్తున్నారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో ప్రశాంత్ కిషోర్ తో షర్మిల భేటీ అయి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ పై ఒక అవగాహనకు వచ్చారు. పాదయాత్ర సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాలపై రూపకల్పన చేశారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా షర్మిల పాదయాత్ర చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి లను టార్గెట్ చేస్తూ వారిని కట్టడి చేయడానికి ప్రత్యేక వ్యూహాలు ఖరారు చేస్తున్నారు.
పాదయాత్ర సమయంలో షర్మిల చేపట్టబోయే కార్యక్రమాల విషయంలో పీకే షర్మిల ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే క్రమంలో మాట్లాడాల్సిన విషయాలపై చర్చించారు. ప్రత్యర్థి పార్టీలపై ఏ రకమైన వ్యాఖ్యలు చేయాలనే దానిపై కూడా చర్చించారు. పక్కా వ్యూహాలు సిద్దం చేసుకుని పాదయాత్రకు కదలాలని నిశ్చయించుకున్నారు. దీంతో భవిష్యత్ లో వైఎస్సార్ టీపీ లక్ష్యాలను ఖరారు చేసుకున్నారు.