కేంద్ర పర్యావరణ, సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌పై ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. ప్రజల డిమాండ్‌పై రామయణం సీరియల్‌ను శనివారం నుంచి దూరదర్శన్‌లో తిరిగి ప్రసారం చేస్తున్నట్లు జవదేకర్ ప్రకటించడంతో విరుచుకు పడ్డారు.
దేశం అంతటా ప్రజలు ఆకలితో, ఆవేదనతో, జీవన్మరణ సమస్యలలో ఉంటె మన మంత్రులు మాత్రం రామాయణ, మహాభారత వంటి మత్తుమందులను ప్రజలకు అందిస్తూ తాము సంబరాలు చేస్తుకుంటున్నారా అంటి ఎద్దేవా చేశారు. పైగా, హృదయం లేని మంత్రులు అంటూ అవహేళన చేశారు.
ఈ సీరియల్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు ఒక ఎపిసోడ్, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేస్తారు. తొలిసారి రామయణం సీరియస్ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారం అయింది.
నేడు ప్రారంభమైన ఈ సీరియల్‌ను తాను చూస్తున్నట్లు మరి మీరు అని ప్రజలను అడుగుతూ ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ భూషన్ భగ్గుమన్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఆందోళనతో లాక్‌డౌన్ లో ఉన్న నేపథ్యంలో కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని గుర్తు చేశారు. స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రజలు వందల మైళ్లు కాలినడకన ప్రయాణిస్తున్నారని తెలిపారు.
ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాత్రం ప్రజలకు రామాయణ, మహాభారతాన్ని మత్తుమందు వలె ఎక్కిస్తున్నారని ధ్వజమెత్తారు.