Homeజాతీయ వార్తలుకరోనా వైరస్ అంటే ...ఏమిటో తెలుసా ?

కరోనా వైరస్ అంటే …ఏమిటో తెలుసా ?

కరోనా వైరస్ అనేది కొత్త గా వచ్చిన వైరస్ జాతి. ఇప్పటికే 6 రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు వైద్య శాస్త్రం లో అందుబాటులో ఉన్నది. ఇప్పటి వైరస్ కరోనా జాతి లోని 7 రకంగా చెప్పుకోవాలి. అంతకుముందు లేని కొత్త జన్యు రూపంతో ఇది బయటపడింది కాబట్టి దీనికి నావెల్ కరోనా వైరస్ ( NOVEL CORONA VIRUS ) అని, 2019 లో కనుగొనబడింది కాబట్టి నావెల్ కరోనా వైరస్ -19 (NOVEL CORONA VIRUS- 19 ) అని నామకరణం చేశారు. అందుకే దీని ద్వారా వచ్చే జబ్బును COVID-19 గా వ్యవహరిస్తున్నారు. దీని జీన్ మ్యాపింగ్ ( GENE MAPPING )ను కూడా తెలుసుకున్నారు.

మిగతా వైరస్ ల లాగే ఇది కూడా ఒక వైరసే. కాకపోతే కొత్త జన్యు రూపంతో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి ఇంకాతెలియలేదు. అవి ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి.

అసలు వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.
ఇది ఒక నిర్జీవి అంటే ప్రాణం లేనిది. ఇది కంటి, ముక్కు, గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, కన్ను, ముక్కు, గొంతు కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్య పరంగా వృద్ధి అయ్యే విధంగా చేస్తుంది. దాంతో మనకు అనారోగ్యం వస్తుంది .

వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరగని పని .. దానంతట అదే నాశనం మవుతుంది వైరస్ క్షయం (నాశనం ) అయ్యే సమయం మన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత, గాలిలో తేమ మరియు అది (వైరస్ ) ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది. అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 20 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు. అట్లా చేయడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపల వున్న వైరస్ ( ప్రోటీన్ అణువు ) దానంతట అదే విచ్చన్నమౌతుంది.

సహజం గా మన నిత్యజీవితం లో వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలుసు. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి. వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, అంత త్వరగా మరియు సులభంగా వైరస్ ను కరిగించగలం.
ఇంకో విషయం కొవ్వులు ఆల్కహాల్‌ లో బాగా కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించనా కూడా వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

వైరస్ నిర్జీవి కనుక దానిని యాంటీబయాటిక్స్ నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. నిజానికి యాంటీ బయాటిక్స్ బాక్టీరియా జీవులను మాత్రమే చంపగలవు. నిజానికి మనం
ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి అది మనకు హాని చేసే అవకాశం ఉంది.
వైరస్ బట్టలపై 3 గంటల వరకూ, సహజసిద్ధమైన యాంటీ సెప్టిక్ అయిన రాగిపై 4 గంటలు, చెక్కపై 4 గంటలు, కార్డ్ బోర్డు పై 24 గంటలు, లోహాలపై 42 గంటలు మరియు ప్లాస్టిక్ పై 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది. వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వైరస్ లు వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి. అందుకే మన పరిసరాలను తేమ లేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.

ఆరోగ్య వంతమైన మానవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు. అలాగే వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు కొవ్వు లను కరిగించే శక్తి లేదు. స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం. ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి. అందుకే 65% ఆల్కహాల్ కలిగిన లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. విశాల మైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

ఆహార పదార్థాలు, తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 20 సెకన్ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది. మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే అంత త్వరగా వైరస్ ను విచ్చిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది. చివరగా గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా చూసుకోవాలి . ఆ క్రమంలో గోళ్ళ పరిమాణం యెంత తక్కువగా ఉంటే అంత మంచిది .
Knowing a thing prevents danger

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version