Samantha: నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడుపుతూ వచ్చిన సమంత(Samantha Ruth Prabhu) రీసెంట్ గానే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidmoru) ని పెళ్లాడింది. ఈ సందర్భంగా ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసిన ఈ జంటనే కనిపిస్తోంది. అసలు ఎవరు ఈ రాజ్ నిడిమోరు అంటూ అతని గురించి తెలుసుకోవడానికి నెటిజెన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. గతం లో ఆయన సమంత తో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించాడు. ఈ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పెరగడం, అది పెళ్లి గా మారడం వంటివి జరిగాయి. రాజ్ నిడిమోరు కి కూడా ఇది రెండవ పెళ్లి. 2022 వ సంవత్సరం లో ఆయన తన భయ శ్యామిలి తో విడాకులు తీసుకున్నాడు.
అయితే ఆమె నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో సమంత అక్కినేని గా పేరుగా మార్చుకుంది. అయితే రాజ్ తో పెళ్లి జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఆమె తన పేరుని మార్కకోలేదు. సమంత రూత్ ప్రభు గానే ఆమె కొనసాగుతుంది. ఇంటి పేరు మార్చుకోవడం తనకు ఏ మాత్రం కలిసిరాలేదని, నేను నా ఒరిజినల్ పేరుతోనే కొనసాగుతానని రాజ్ తో సమంత పెళ్ళికి ముందే చెప్పిందట. అందుకు రాజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో సమంత పేరు సమంత రూత్ ప్రభు గానే కొనసాగుతుంది. మేల్ డామినేషన్ ఉన్నటువంటి ఈ సమాజం లో, సమంత మనసుని ఇంతలా అర్థం చేసుకోవడం నిజంగా గ్రేట్ కదూ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రం లో నటిస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇందులో సమంత నటించడం మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం.