Prakash Raj , Pawan Kalyan
Prakash Raj and Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) తమిళనాడులో హిందీ వ్యతిరేక భావనను ప్రశ్నించారు. దానిని తప్పు పట్టారు. జనసేన ప్లీనరీలో దీనిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ భాషను వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించారు. సంస్కృతంతో పాటు హిందీ భాషను కించపరిచేలా తమిళ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది పెను దుమారానికి దారితీసింది. అయితే తమిళ రాజకీయ నేతలు ఈ విషయంలో స్పందించలేదు కానీ.. అనూహ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read : 30 వ తేదీన ఇండియాకు వస్తాను..మీ లెక్క ఏంటో తెలుస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందన!
* ప్రారంభం నుంచి అంతే..
పవన్ కళ్యాణ్ జాతీయ అంశాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు. దీనిపై తరచూ కౌంటర్ ఇస్తుంటారు ప్రకాష్ రాజ్( actor Prakash Raj). గతంలో తిరుమల లడ్డు వివాదంలో సైతం పవన్ కళ్యాణ్ తీరును తప్పు పట్టారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కామెంట్స్ పై సెటైర్లు వేశారు. బిజెపి అజెండాను పవన్ అమలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం బిజెపి ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారు అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏపీలో గెలిచిన తర్వాత పవన్ ఎక్కువగా తమిళ రాజకీయాలపైనే మాట్లాడారు. అయితే అదే రాష్ట్రానికి చెందిన నటుడు ప్రకాష్ రాజ్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
* గట్టిగానే మాట్లాడిన పవన్
తాజాగా జనసేన ప్లీనరీ వేదికగా పవన్ కళ్యాణ్ తమిళనాడు( Tamil Nadu ) గురించి మాట్లాడారు. అక్కడ హిందీ తో పాటు సంస్కృతం భాషలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు గురించి గట్టిగానే స్పందించారు. అయితే ఇప్పుడు అంతే గట్టిగా స్పందించారు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఇతవు పలికారు. ట్విట్టర్ వేదికగా ‘ మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ ‘ అంటూ కామెంట్స్ చేశారు.
* గంటల వ్యవధిలోనే
అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కామెంట్స్ పై తమిళ రాజకీయ పార్టీ నేతలు ఎవరు ఇంతవరకు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన గంటల వ్యవధిలోనే ప్రకాష్ రాజ్ టార్గెట్ చేయడం విశేషం. అంటే పవన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో నని ప్రకాష్ రాజ్ ఎదురుచూస్తున్నట్టు కనిపించింది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ను నిత్యం వెంటాడుతున్నారు ప్రకాష్ రాజ్. అయితే తమిళ నేతలపై పవన్ ప్రసంగం వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ప్రాంతీయ భాషా విషయంలో మాత్రం తమిళులకు చాలా పట్టు. దీనిపై వారు సంఘటితంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read : అభిమానులకు క్లాస్ ఇచ్చిన పవన్.. అధికారం కోసం తప్పదు మరీ?
"మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… #justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025