Nani : నటుల కెరీర్ కి గ్యారెంటీ ఉండదు. అందుకే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. ఫేమ్ లో ఉన్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలి. అందుకు వ్యాపారమో, సినిమా నిర్మాణమో చేయాలి. టాలీవుడ్ హీరోలందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్… ఒక్కరేంటీ.. ప్రతి ఒక్క హీరోకి మరో బిజినెస్ ఉంది. హీరో నాని కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఆయన చాలా కాలం క్రితమే వాల్ పోస్టర్ సినిమా పేరుతో ఒక బ్యానర్ ఏర్పాటు చేశాడు. ఈ బ్యానర్ లో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నాడు. డీ ఫర్ దోపిడీ ఈ బ్యానర్ లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ. ఇది అంతగా ఆడలేదు. అనంతర అ టైటిల్ తో ప్రయోగాత్మక చిత్రం నిర్మించారు. ఇది కమర్షియల్ గా ఆడలేదు.
Also Read : నాని ప్రొడ్యూసర్ గా చేసి ఎంత సంపాదించాడో తెలుసా..?
దర్శకుడు శైలేష్ కొలనుతో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ కి మహర్దశ పట్టింది. హిట్ టైటిల్ తో శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ విజయం అందుకుంది. హిట్ సిరీస్లో రెండో చిత్రంగా హిట్ 2 నిర్మించాడు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సైతం మంచి విజయం నమోదు చేసింది. ఈ రెండు చిత్రాలు నానికి లాభాలు తెచ్చిపెట్టాయి. శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో మూడో భాగంగా హిట్ 3 తెరకెక్కింది. ఈ మూవీలో స్వయంగా నాని హీరోగా నటిస్తున్నాడు.
నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్. ప్రియదర్శి ప్రధాన పాత్ర చేసిన ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. కోర్ట్ ఓటీటీ రైట్స్ రూ. 9 కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఫస్ట్ డే ప్రీమియర్స్ తో కలిపి కోర్ట్ మూవీ రూ. 8 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని అంచనా. కోర్ట్ మూవీ బడ్జెట్ కేవలం రూ. 5-10 కోట్ల మధ్య ఉంటుంది. అనే సినిమా బడ్జెట్ ఓటీటీ రైట్స్ తో కవర్ అయ్యింది. ఇక థియేట్రికల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ అదనంగా వచ్చే ఆదాయం. సినిమా భారీ వసూళ్లు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.
కోర్ట్ మూవీ నానికి పెద్ద ఎత్తున లాభాలు అందించింది. హిట్, హిట్ 2 చిత్రాలతో కూడా నాని లాభాలు పొందారు. చిన్న సినిమా నిర్మాణం రిస్క్ లేని పని. తమ బ్రాండ్ ఇమేజ్ తో ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. ఫెయిల్ అయితే మన డబ్బు మనకు వస్తుంది. హిట్ అయితే పెట్టుబడికి రెండు మూడింతల లాభాలు పొందొచ్చు. మొత్తంగా పావలా పెట్టుబడికి రూపాయి ఆర్జిస్తూ నాని పక్కా బిజినెస్ మ్యాన్ అనిపిస్తున్నాడు.
Also Read : ఆ దర్శకుడిని నాని అంత భయపెట్టాడా? నా సినిమా సేఫ్ అంటూ, సోషల్ మీడియా పోస్ట్