https://oktelugu.com/

ప్రగతి భవన్ కూల్చి అంబేద్కర్ విగ్రహం పెడతాం: బండి సంజయ్

ప్రగతిభవన్ కూల్చి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఉప ఎన్నికలో కేసీఆర్ ధనం.. బీజేపీ ప్రాణం పై ఆధారపడి ఉంటుందన్నారు. డబ్బు సంచుల్లో గుమ్మరింకేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కి కొత్త హామీలతో మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ […]

Written By: , Updated On : July 30, 2021 / 06:59 PM IST
Follow us on

Bandi Sanjayప్రగతిభవన్ కూల్చి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు గమనిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఉప ఎన్నికలో కేసీఆర్ ధనం.. బీజేపీ ప్రాణం పై ఆధారపడి ఉంటుందన్నారు. డబ్బు సంచుల్లో గుమ్మరింకేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటిని తుంగలో తొక్కి కొత్త హామీలతో మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మాట దాటేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పడాన్ని తప్పుబట్టారు. వారికి రూ.50 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్ని చేసినా హుజురాబాద్ లో ఈటల గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అధికారులను పంపి వారి పొలాలను నాశనం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈటల బావమరిదిని ఎందుకు అరెస్టు చేయించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేనిపోని ఆరోపణలు ప్రసార మాధ్యమాల్లో చూపిస్తూ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ నాటకాలు ప్రజలకు తెలిసి పోయాయని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదోద పట్టించేందుకు రకరకాల దారులు వెతుకుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే పలు పథకాలు ప్రకటిస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని వాపోయారు. ఇంత దారుణానికి పాల్పడుతున్న కేసీఆర్ కు గడ్డు రోజులు దగ్గర పడ్డాయని చప్పారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి వారిని పెడదోవ పట్టించిన ఘనత ఆయనకే చెల్లుతుందన్నారు. అందుకే ఈసారి అందరు ఏకమై టీఆర్ఎస్ కు ఘోరీ కట్టడం ఖాయమని పేర్కొన్నారు.

నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పనకు ఏ నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ధోరణితో వారిని సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు ఉద్యోగాలపై ఆశలు పెంచుకున్న యువత ఆశలు వదులుకుని ఆత్మహత్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కపట నాటకంపై అందరు గమనిస్తున్నారని సూచించారు. రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.