PPF monthly income tax-free : అలాగే ఎటువంటి పనులు లేకుండా కూడా లక్షల రూపాయలు సంపాదించుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పిపీఎఫ్ నుంచి మీరు ప్రతి నెల లక్ష రూపాయలకు పైగా సంపాదించుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా మీరు పిపీఎఫ్ ఖాతాలో కనీసం గా రూ.500 రూపాయల నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీంట్లో మీరు ఏడాదికి ఒకేసారి లేదా 12 నెలలలో నెలవారి వాయిదాలలో కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ఏడాది రూ.1.5 లక్షలు క్రమం తప్పకుండా 15 ఏళ్ల పాటు పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టినట్లయితే 15 ఏళ్ల తర్వాత మీ ఖాతా మెచ్యూరిటీ అవుతుంది.
15 ఏళ్ల మెచ్యూరిటీ సమయం పూర్తి అయిన తర్వాత మీరు పిపీఎఫ్ ఖాతాని మరొక ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఈ 15 ఏళ్లలో మీ పిపిఎఫ్ ఖాతాలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.22.5 లక్షలు ఉంటుంది. అయితే 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి రూ.40.68 అందుతుంది. ఇక ఆ తర్వాత మీరు 20 లేదా 30 ఏళ్లకు మీ పిపిఎఫ్ ఖాతాను పొడిగించినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి మొత్తం రూ.66.58 లక్షలు లేదా రూ.1.54 కోట్లు అందుతాయి. మీరు పిపీఎఫ్ ఖాతాలో పెట్టే నిరంతర పెట్టుబడి అలాగే వడ్డీ సమ్మేళనంతో కలిపి మీకు మెచ్యూరిటీ సమయానికి అంటే దాదాపు 33 ఏళ్ల తర్వాత మీరు రూ.1.95 కోట్లు అవుతుంది. అంటే మీరు 33 ఏళ్లలో రెండు కోట్ల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అన్నమాట.
ఈ మొత్తంలో దాదాపు రూ.1.45 కోట్లు వడ్డీ ఉంటుంది. ఈ మొత్తం డబ్బుపై మీకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపు ఉంటుంది అని సమాచారం. పిపీఎఫ్ పథకంలో మీరు 33 ఏళ్ల తర్వాత ఏడాదికి దాదాపు రూ.16.24 లక్షలు వడ్డీ అందుకుంటారు. పిపీఎఫ్ పథకాలు మీకు దేశవ్యాప్తంగా అన్ని పోస్ట్ ఆఫీస్ లలో అలాగే బ్యాంకులలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఇందులో కేవలం రూ.500 రూపాయలు జమ చేసే పిపిఎఫ్ ఖాతాను తెరవచ్చు. అత్యంత ప్రజాదారణ పొందిన పథకాలలో పిపిఎఫ్ పథకం ముందంజలో ఉంది.