Power cuts: ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే విద్యుత్ సమస్య ఉండదని.. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో రాష్ట్రం కూరుకుపోతుందని.. నిపుణుల అంచనా వేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కారుచీకట్లు కమ్ముకోక తప్పదని చాలామంది విశ్లేషించారు. అయితే రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజులకే సీన్ మారింది. తెలంగాణ అవతరించడం.. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే.. విద్యుత్ సమస్యపై విశ్లేషణ చేశారు. వెంటనే చత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏర్పాటు చేశారు. కొద్ది నెలల్లోనే పని పూర్తి చేశారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. అయితే ఏపీలో పరిస్థితులు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. రెండు రోజుల బొగ్గుకొరతకే.. ఏర్పడుతోంది. ఇంతకీ ఎందుకీ సంక్షోభం ఏపీలో పరిస్థితితులు తిరగబడడానికి కారణం ఏంటని ప్రముఖ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

ఏపీలో గత కొద్దిరోజులుగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడుతోంది. విపరీతమైన కరెంటు కోతలు ఆ రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలుగైదు రోజులుగా గంటల తరబడి విధిస్తున్న విద్యుత్ కోతలు.. అక్కడి ప్రజలకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. కారణం.. ఏపీలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో బొగ్గు నిల్వల కొరత. అవును ఏపీలో ఉన్న మూడు, నాలుగు విద్యుత్ ప్లాంట్లలో కేవలం మూడు నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయి. దీంతో కోతలు అనివార్యం అయ్యాయి. దీనికి తోడు.. ఇక్కడ బొగ్గు నిక్షేపాలు లేవు. పక్క ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని ఏపీ పెద్గగా పట్టించుకోవడం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. బొగ్గు అవసరం ఉన్నా కొనుగోలు చేయడం లేదు. దీంతో విద్యుత్ కొరత ఏర్పడుతోంది. ఈ సమస్య మొదటి నుంచి ఉత్పన్నం అవుతున్నా.. పరిష్కరించే దిశగా జగన్ సర్కారు అడుగులు వేయడం లేదు.
అదే విధంగా విద్యుత్ హామీల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ కన్నా చాలా వెనకబడి ఉంది. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ప్రకారం అక్కడి ప్రజలకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తోంది. వ్యవసాయానికి కూడా నిరంతర విద్యుత్ ను అందిస్తోంది. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన నిరంతర విద్యుత్ హామీ ఇప్పటివరకు నెరవేర్చడం లేదు. కారణం… బొగ్గు కొనుగోలుకు ముందుకు రాకపోవడం. ఫలితంగా ప్రస్తుతం ఏర్పడిన సంక్షోభంలోనూ ఏపీ సర్కారు విలవిలలాడుతోంది. ఏపీలో కారుచీకట్లు కమ్ముకొస్తుంటే.. ముందుచూపుతో ఆలోచన చేసిన తెలంగాణలో మాత్రం విద్యుత్ కోతలు లేకుండా వెలుగులు విరాజిమ్ముతున్నాయి.