https://oktelugu.com/

కరెంటు చార్జీలపై కెసిఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలోనే క్లారిటీ ఇచ్చారు. కరెంట్ చార్జీలతో పాటు, ప్రాపర్టీ టాక్స్(ఆస్తుల సుంఖం) కూడా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. అయితే, నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఇవి పెంచనున్నట్టు కెసిఆర్ తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మాట్లాడిన కెసిఆర్.. 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్ చార్జీల పెంపుకు సహకరించాలని కెసిఆర్ కోరారు. ఓట్ల కోసం భయపడడం […]

Written By: , Updated On : March 13, 2020 / 02:51 PM IST
Follow us on


తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపు అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలోనే క్లారిటీ ఇచ్చారు. కరెంట్ చార్జీలతో పాటు, ప్రాపర్టీ టాక్స్(ఆస్తుల సుంఖం) కూడా పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. అయితే, నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ఇవి పెంచనున్నట్టు కెసిఆర్ తెలిపారు.

అసెంబ్లీలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మాట్లాడిన కెసిఆర్.. 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్ చార్జీల పెంపుకు సహకరించాలని కెసిఆర్ కోరారు. ఓట్ల కోసం భయపడడం మానేశాం.. ఎన్నికల్లో ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. అభివృద్ధిపైనే తమ దృష్టంతా అని స్పష్టం చేశారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో ప్రాపర్టీ టాక్స్ పెంచబోతున్నాం.. నిరుపేదలకు ఇబ్బంది లేకుండా పెంచుతాం.. అదే విధంగా మున్సిపాలిటీల్లోనూ టాక్స్ పెంచాల్సి ఉందన్నారు కెసిఆర్. పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చాం.. ఆ చట్టాన్ని అమలు చేసి తీరుతాం.. అనుకున్న ఫలితాలు రాబట్టుకుంటాం, అవసరం అయితే ఎమ్మెల్యేల జీతం కట్ చేస్తాం.. కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఆపబోమని కెసిఆర్ స్పష్టం చేశారు.