Poverty In Telangana and AP: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరు గురించి అందరికీ తెలుసు. ఏళ్ల తరబడి జరిగిన పోరాటం ఫలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. కాగా, ఈ సెపరేట్ స్టేట్‌లో ఇక అభివృద్ధి సాధ్యమవుతుందని అందరు అనుకున్నారు. అందుకు అడుగులు పడుతున్నాయని పాలకులు అంటున్నారు కూడా. కానీ, ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పాటు అయి ఏడేళ్లవుతున్నది. ఈ ఏడేళ్ల టైంలో విభజిత ఏపీ కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం ఉన్నదని నివేదికలు పేర్కొంటున్నాయి.
నీతి ఆయోగ్ రూపొందించి జాతీయ బహువిధ దారిద్య్ర సూచిక ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. పేదరికంలో దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతమున్న తెలంగాణ రాష్ట్రంలో గతంలోని పది జిల్లాల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయగా, ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అయితే, నీతి ఆయోగ్ ఈ నివేదికను 2015-16లో తయారైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వివరాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది.
Also Read: అమరావతి ‘భ్రమరావతి’యేనా.. తెరపైకి కార్పొరేషన్ వ్యవహారం..
ఈ నివేదికలో మెయిన్‌గా హెల్త్, హెల్దీ ఫుడ్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్స్.. ఈ నాలుగు రంగాలను మెయిన్ ప్రాతిపదికగా తీసుకని ప్రజల స్థితిగతులను స్టడీ చేస్తారు. ఆ స్టడీ వివరాల ఆధారంగా ఫైనల్ రిపోర్టును అధికారులు సబ్మిట్ చేస్తారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం… దేశంలో పేదరిక సూచీలో బిహార్ రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది.
51.91 పర్సెంటేజ్‌తో బిహార్ నిరు పేదరికంలో ఉందని నీతి ఆయోగ్ నివేదక స్పష్టం చేస్తోంది. ఇకపోతే పేదరికం అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ ఉంది. ఈ స్టేట్‌లో 0.71 శాతం పేదరికం ఉన్నట్లు రిపోర్టు స్పష్టం చేస్తోంది. మొత్తంగా నీతి ఆయోగ్ నివేదిక దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, లివింగ్ స్టాండర్డ్స్, పేదరికాన్ని చూపింది.
Also Read: బీజేపీని రెచ్చగొడుతున్న టీఆర్ఎస్.. ఆశిస్తుందెంటీ?