SBI is offering a great opportunity : అనుకోకుండా హాస్పిటల్ ఖర్చులు, పిల్లల చదువులకు, ప్రయాణ ఖర్చులు ఇలా ప్రతిసారి డబ్బుతో ఏదో ఒక అవసరం ఉంటుంది. ఇటువంటి ఆర్థిక సమయంలో మీకు పర్సనల్ లోన్ చాలా సహాయపడుతుంది. అందులోనూ మీరు ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది మీకు చాలా మంచి ఆప్షన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఇంటి నుంచి ఫోన్లో కేవలం ఐదు నిమిషాలలో పర్సనల్ లోన్ పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజు మీకు తక్కువ వడ్డీ రేటు తో అలాగే ఈజీ ఈఎంఐ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో టాప్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కస్టమర్లకు చాలా నమ్మకం. మనదేశంలో కోట్లాదిమందికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్నాయి.
Also Read : ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు.. ఆరోగ్య సేవలకు ఆకర్షణీయ ఆఫర్లతో..
తాజాగా తక్కువ వడ్డీతో రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది. దీనికి 10.30 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతాయి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగున్నట్లయితే ఇందులో మీరు కేవలం తక్కువ వడ్డీకే లోన్ పొందవచ్చు. మీరు ప్రైవేటు సంస్థల నుంచి లోన్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఎక్కువ వడ్డీకి లోన్ లభిస్తాయి. కానీ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐలో మీరు కనిష్ట వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మీరు ఎస్బిఐ అందిస్తున్న ఈ పర్సనల్ లోన్ అప్లై చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో నుంచి మీరు మీ ఫోన్లో ఉన్న ఎస్బిఐ యోనో యాప్ లో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో కూడా పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మొదట మీరు యోనా యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మీకు ఎంత లోన్ కావాలో ఎంపిక చేయాలి. అలాగే ఎంత కాలంలో తిరిగి చెల్లిస్తారో కూడా సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఓటీపీ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మీకు పర్సనల్ లోన్ కు ఆమోదం వచ్చిన వెంటనే ఆ లోన్ డబ్బులు మీ అకౌంట్లో జమ చేయబడతాయి. ఒకవేళ ఆన్లైన్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడం మీకు అసౌకర్యంగా ఉన్నట్లయితే మీరు మీకు సమీపంలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ కి వెళ్లి అక్కడ లోన్ ఫామ్ నింపి అప్లై చేసుకోవచ్చు. బ్యాంక్ అధికారులు పర్సనల్ లోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందిస్తారు.