Posani Krishna Murali : రాజకీయాలను( politics) రాజకీయాలుగానే చూడాలి. తలకు ఎక్కించ కూడదు. దురదృష్టవశాత్తు తెలుగు రాజకీయాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు విపక్ష నేతలను వెంటాడడం పరిపాటిగా మారింది. అయితే అధికారం తారుమారు అయితే.. అదే స్థాయిలో ఇబ్బందులు కూడా వస్తాయి. చాలా రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబ జీవనానికి ఇబ్బందికరంగా మారుతుంది. దానిని తట్టుకుంటేనే ప్రత్యర్ధులపై విమర్శలు చేయాలి. లేకుంటే రాజకీయంగా హుందాతనం ప్రదర్శించాలి. ఇది తెలియక చాలామంది రాజకీయాల కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల్లో పెడుతుంటారు. ఇప్పుడు పోసాని కృష్ణ మురళి పరిస్థితి అదే.
* జడ్జి ఎదుటే కన్నీటి పర్యంతం
నిన్న గుంటూరు కోర్టులో( Guntur Court) పోసాని కృష్ణ మురళి న్యాయమూర్తి ఎదుటే బోరున విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని.. రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని కన్నీటి పర్యాంతం అయ్యారు. రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని న్యాయమూర్తి ఎదుట వాపోయారు. అయితే న్యాయస్థానంలో సెంటిమెంట్లకు తావు ఉండదు కనుక.. పోసానికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. దీంతో ఒక్కసారిగా నీరు గారి పోయారు పోసాని. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు ఆయనను. కొద్దిరోజుల కిందట అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి పై చాలా కేసులు నమోదయ్యాయి. దాదాపు అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. బయటకు వెళ్తున్న క్రమంలో సిఐడి పిటి వారెంట్ ఇచ్చింది. గుంటూరు కోర్టుకు హాజరు పరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
* మిగతావారు నేర్చుకోవాల్సిందే..
అయితే పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) బాధ ఒక విధంగా మిగతా వారికి గుణపాఠం. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని. జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానాన్ని చాటుకోవాలి కానీ.. రాజకీయ ప్రత్యర్థులను కించపరుస్తూ మాట్లాడడం.. తిట్ల దండకం అందుకోవడం.. వారి కుటుంబ సభ్యులను తిట్టడం ఘోరమైన నేరం. ఆయన జైలులో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నారు సరే. అది అత్యంత బాధాకరం కూడా. కానీ ఇదే పోసాని కృష్ణ మురళి 70 సంవత్సరాల చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు హేళనగా మాట్లాడారు. నిజాయితీగా బయటపడు అంటూ సూచించారు. జైలు జీవితం అనుభవించి బయటకు రా అంటూ సలహా ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకు ఆత్మహత్య శరణ్యమని నిర్ణయానికి రావడం.. ఇంకా ఎంత పెయిన్ ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
* స్థాయి మరిచిపోకూడదు..
ఒక రాజకీయ పార్టీ( political party) నేతగా తమ పార్టీ సిద్ధాంతాలను చెప్పుకోవచ్చు. తమ అధినేత పట్ల అభిమానాన్ని చాటుకోవచ్చు. కానీ దానికి మితిమీరి రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, అనుచిత కామెంట్స్ చేయడం మాత్రం ముమ్మాటికీ నేరం. పోసాని కృష్ణ మురళి కాదు.. అది ఎవరు చేసినా తప్పిదమే. స్థాయి మరిచి.. తాము ఉన్న స్థానాన్ని మరిచి వ్యాఖ్యానిస్తే పోసాని కృష్ణ మురళి మాదిరిగానే పరిస్థితి వస్తుంది. ముమ్మాటికి పోసాని కృష్ణ మురళి ఎపిసోడ్ ప్రతి ఒక్కరికీ గుణపాఠమే.
Also Read : పోసానికి దెబ్బ మీద దెబ్బ..కోలుకోలేని షాక్ ఇచ్చిన హై కోర్టు..ఇక జైలుకే పరిమితం?