Heroine : అమాయకంగా కెమెరాకు ఫోజిచ్చిన ఈ పాప తెలుగు హీరోయిన్. కానీ ఆమె కెరీర్ బాలీవుడ్ లో మొదలైంది. మోడలింగ్ చేసిన అమ్మడు పలు యాడ్ ఫిల్మ్స్ లో నటించింది. 2016లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఈమె తెలుగులో చేసింది కేవలం రెండు చిత్రాలు మాత్రమే. బడా ఫ్యామిలీకి చెందిన హీరోని ప్రేమ వివాహం చేసుకుని వేల కోట్లకు అధిపతి అయ్యింది. ఆ పాప ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు శోభిత ధూళిపాళ్ల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో 1992లో పుట్టిన శోభిత ధూళిపాళ్ల వైజాగ్ లో చదువుకుంది. అనంతరం ముంబైకి వెళ్ళింది. మోడల్ గా రాణించాలి అనేది ఆమె కల. అందుకే ముంబైకి మకాం మార్చింది. మొదట్లో తిరస్కరణలు, అవమానాలు ఎదురయ్యాయట. నువ్వు మోడల్ వా? బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావని ఎగతాళి చేశారట. అలా అవమానించిన పంపిన సంస్థే అనంతరం తనతో యాడ్స్ చేసిందని ఆమె అన్నారు. హిందీ చిత్రం రామన్ రాఘవ్ 2.0 శోభిత మొదటి చిత్రం.
Also Read : ఆ హీరోయిన్ ఉందంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్టు కొట్టినట్టేనా..?
ఇక తెలుగులో శోభిత గూఢచారి చిత్రంలో నటించింది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ తిలక్ తెచ్చుకుంది. అలాగే అడివి శేష్ నటించిన మరొక చిత్రం మేజర్ లో శోభిత నటించింది. గూఢచారి చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న జీ2 లో శోభిత నటిస్తుందని సమాచారం. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ లో శోభిత ధూళిపాళ్ల కీలక రోల్ చేసింది. శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్. శోభిత నటించింది తక్కువ చిత్రాలే అయినా.. ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది.
కాగా హీరో నాగ చైతన్యను శోభిత ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్లకు పైగా శోభిత-నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నారు. అప్పట్లో ఎఫైర్ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. విదేశాల్లో విహరిస్తున్న వీరి ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. అయినప్పటికీ ఎఫైర్ రూమర్స్ శోభిత ధూళిపాళ్ల ఖండించింది. 2024 ఆగస్టు లో శోభిత -నాగ చైతన్యలకు ఎంగేజ్మెంట్ జరిగింది. అత్యంత నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక ముగించారు.
అదే ఏడాది డిసెంబర్ నెలలో శోభిత మెడలో నాగ చైతన్య తాళికట్టాడు. అన్నపూర్ణ స్టూడియోలో వివాహం జరిగింది. పెళ్లి కూడా సింపుల్ గానే ముగించారు. కేవలం 300 మంది అతిథులను, సన్నిహితులను ఆహ్వానించారు. అక్కినేని నాగార్జునకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలాగే తల్లి తరపు నుండి కూడా నాగ చైతన్య ఆస్తి సంక్రమించనుంది. నాగ చైతన్య ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంటుందని సమాచారం. నాగ చైతన్య సతీమణిగా శోభిత సైతం అత్యంత ధనవంతురాలు అయ్యారు.