
Population in India: How much has the population of any religion increased in India in the last 70 years?సువిశాల భారతం.. అంతకుమించిన జనాభా సామర్థ్యం. భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత్ లో జనాభా విస్ఫోటనం జరుగుతోంది. అయితే స్వాతంత్ర్యం నుంచి ఇప్పటిదాకా చూస్తే జనాభా సంతానోత్పత్తి రేటులో హిందువులు బాగా వెనుకబడ్డారు. హిందువుల సంతానోత్పత్తి రేటు కేవలం 3శాతం మాత్రమే పెరగగా.. అదే సమయంలో దేశంలోని ముస్లింల సంతానోత్పత్తి రేటు ఏకంగా 6శాతం పెరిగింది. మిగిలిన మతాలవారివి పెరిగాయి. హిందువుల రేటు తగ్గడం గమనార్హం. హిందూదేశంగా ఖ్యాతిగాంచిన భారత్ లో కొన్ని వర్గాల్లో జనాభా నియంత్రణ లేక విపరీతంగా పెరగడం కాస్త కలవరపెట్టేదిగానే చెప్పొచ్చు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాగా ఆ తరువాత భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. సువిశాల విస్తీర్ణంలో భారతదేశ జనాభా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నిరక్షరాస్యత, సంతానంపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది జనాభా కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోతోంది. అయితే గత పదేళ్లలో అక్షరాస్యత శాతం పెరగడంతో చదువుకున్నవారు ఇద్దరితోనే సంతానానికి బ్రేక్ వేశారు. అయితే కొన్ని మతస్థులలో మాత్రం ఇది సాధ్యం కావడం లేదు. తాజాగా ఓ మతంలోని జనాభా మిగతా మతాల కంటే అధికంగా ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసింది.
భారతదేశ జనాభా లెక్కించడం 1951లో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇండియా మొత్తంగా జనాభా 36.1 కోట్లుగా ఉంది. ఆ తరువాత 2011 నాటికి 120 కోట్లకు పెరిగింది. భిన్నమతాల దేశంలో ఈ జనాభాలో అన్ని మతస్థుల వారు ఉన్నారు. హిందువులు, ముస్లింలు కలిపి 94 శాతం ఉండగా.. క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, జైనులు కలిపి 6 శాతంగా ఉన్నారు. 2011 జనాభా లెక్కింపు తరువాత 2021 లో జన గణన జరగాల్సి ఉంది. అయితే కొవిడ్ కారణంగా జనాభా లెక్కింపు వాయిదా వేశారు. 1951 నుంచి 2011 వరకు చూస్తే హిందువుల జనాభా 30.4 కోట్ల నుంచి 96.6 కోట్లకు పెరిగింది. అదే ముస్లింల జనాభా 3.5 కోట్ల నుంచి 17.2 కోట్లకు పెరిగింది. అలాగే క్రైస్తవుల జనాభా 80 లక్షల నుంచి 2.8 కోట్లకు పెరిగినట్లు జనాభా లెక్కలు చూపిస్తున్నాయి.
జనాభా పెరుగుదలపై అవగాహన, అక్షరాస్యత రేటు పెరగడంతో ఇండియాలో కొంత మేర అధిక సంతానోత్పత్తి తగ్గింది. అయితే మతాల వారీగా చూస్తే ముస్లింలలో సంతానోత్పత్తి అధికంగా ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ అధ్యయన 2015 లెక్కలు చెబుతున్నాయి. ప్రతి 100 మంది ముస్లిం మహిళలు 260 మంది పిల్లలను కంటున్నారు. ఈ రేటు హిందువుల్లో తక్కువగా ఉంది. వీరిలో ప్రతి 100 మంది మహిళలు 210 మంది పిల్లలను కంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సంతానోత్పత్తి రేటు 1992తో పోలిస్తే 1999లో తక్కువగా ఉంది. ఈ ఆరేళ్లలో ముస్లింలలో సంతానోత్పత్తి 4.4 ఉండగా.. హిందువుల్లో 3.3. గా ఉంది. మొత్తంగా చూస్తే హిందువుల్లో కంటే ముస్లింలల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉందని తెలుస్తోంది.
ముస్లిం వర్గంలో 25 ఏళ్ల లోపు మహిళల్లో సంతానోత్పత్తి రేటు తగ్గింది. దేశవ్యాప్తంగా 1990లో 3.4 సంతానోత్పత్తి రేటు ఉండగా 2015 నాటికి 2.2 తగ్గింది. ఇందులో ముస్లింలలో 4.4 నుంచి 2. 6 కు తగ్గింది. 1990 సంవత్సరంలో పోలిస్తే 2015లో ఈ వయసు మహిళలు ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారు. మిగతా భారతీయుల కంటే ముస్లిం మహిళలు సంతానోత్పత్తి రేటులో ఎక్కువగా ఉండడం జనాభా పెరుగుదల కారణమని స్టెఫానీ క్రామర్ అన్నారు.
మహిళల్లో అక్షరాస్యత శాతం పెరుగుతుండడంతో వారిలో సంతానంపై అవగాహన పెరుగుతుంది. దీంతో ఉన్నత విద్యావంతులైన మహిళలు మిగతా మహిళల కంటే ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. అంతేకాకుండా పిల్లలను కనడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. చదువుకున్న వారు, ఉన్నత కుటుంబానికి చెందిన మహిళల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా 2.2 శాతం తగ్గింది. ఇది అమెరికా కంటే ఎక్కువే. అయితే కుటుంబాల్లోని మార్పులకు, పరిస్థితులు సంతానోత్పత్తిపై ఆధారపడుతాయి. కానీ సంతానోత్పత్తికి మతానికి సంబంధం లేదని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం తెలిపింది.