https://oktelugu.com/

Corona: దేశంలో కాస్త పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. బుధవారం 27 వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 32 వేల చేరువలో నిలిచాయి. కొత్తగా కరోనా బారినపడిన వారిలో 19 వేల మంది ఒక్క కేరళలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్ కేసులు సమోదవగా, 282 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421 చేరగా, మరణాలు 4,46,050కి పెరిగాయి. మరో 3,28,15,731 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,01,604 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 23, 2021 10:56 am
    Corona third wave
    Follow us on

    Corona third wave

    దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. బుధవారం 27 వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 32 వేల చేరువలో నిలిచాయి. కొత్తగా కరోనా బారినపడిన వారిలో 19 వేల మంది ఒక్క కేరళలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్ కేసులు సమోదవగా, 282 మంది బాధితులు మరణించారు.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421 చేరగా, మరణాలు 4,46,050కి పెరిగాయి. మరో 3,28,15,731 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,01,604 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 184 రోజుల దిగువకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కొత్తగా 31,990 మంది వైరస్ నుంచి బయటపడ్డారని తెలిపింది. ఒక్క  కేరళలోనే 19,675 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

    మహారాష్ట్రంలో 3 వేల మందికి వైరస్ సోకింది. నిన్న మరో 282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య గణాంకాలను వెల్లడించింది. నిన్న 31 వేలమంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,01,640 మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. ఇక 4,46,050 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. క్రియాశీల కేసులు రేటు 0.90 శాతం, రికవరీ రేటు 97,77 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా టీకా కార్యక్రమం ఆశాజనకంగా ఉంది. నిన్న 71.38 లక్షల మంది టీకాలు తీసుకున్నారు. మొత్తంగా 83.39 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.