Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ప్రయోజనాలు మాత్రమే చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా అప్పటిదాకా ఉన్న ఆప్యాయతలు మొత్తం కరిగిపోతాయి. దారులు వేరవుతాయి. మాటలు మొదలవుతాయి. ఎంత దూరమైనా అవి వెళ్తాయి. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య జరుగుతున్నది అదే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని 2024లో జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని ఆయన శపథం చేశారు. దానికి అనుకున్నట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఖమ్మం జిల్లాలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. తాను ప్రకటించిన అభ్యర్థుల విషయంలో టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఎటువంటి అవగాహన ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు.
దోస్తీ నిజమే
ఆదివారం ఖమ్మం జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా అనే సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన పర్యటన సందర్భంగా భారీగా జన సమీకరణ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇదే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీ ని ముఖ్యఅతిథిగా తీసుకొచ్చి నిర్వహించిన కాంగ్రెస్ సభకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా నిరాకరించింది. తాము వెంటనే డబ్బులు చెల్లిస్తామన్నప్పటికీ ఒప్పుకోలేదు. కానీ అదే అమిత్ షా ప్రోగ్రాం అయితే వెంటనే బస్సులు ఇచ్చేసింది. అంటే పొంగులేటి సభకు ముందు లాభాల్లో ఉన్న ఆర్టీసీ.. అమిత్ షా సభ వరకు అన్న నష్టాల్లో కూరుకుపోయిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పనమవుతున్నాయి.
స్వచ్ఛందంగా వచ్చారు
కాంగ్రెస్ సభ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే జనం ఎక్కువ రావడంతో నాయకుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. కానీ అమిత్ షా సభకు మాత్రం ఆర్టీసీ ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండానే బస్సులు ఇచ్చింది. ప్రభుత్వ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకుండానే బస్సులు ఎలా ఇస్తారు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. అయితే ఇదే విషయం భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య స్నేహ బంధాన్ని చాటుతోందని పొంగులేటి ఆరోపిస్తున్నారు. ఆదివారం మీర్ దొడ్డి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చేరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రోజులకు చేరడంతో.. సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని, భారతీయ జనతా పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది కాబట్టే అమిత్ షా సభకు బస్సులు ఇచ్చారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజా సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Ponguleti srinivasa reddy fire on bjp brs