Skanda Pre Release Event: హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ స్కంద. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా నిర్వహించారు. నటసింహం బాలయ్య ను గెస్ట్ గా ఆహ్వానించారు. ఇక తమ ప్రసంగాల్లో బాలయ్య, రామ్ పోతినేని ఒకరినొకరు ఆకాశానికి ఎత్తుకున్నారు. అయితే బాలయ్య స్పీచ్ విని రామ్, హీరోయిన్ శ్రీలీలకు బాగా నవ్వొచ్చేసింది. వాళ్ళు ఆపుకోవడానికి చాలా ట్రై చేశారు. బాలయ్య సంగతి తెలిసిందే. కోపం వస్తే పబ్లిక్ లో కూడా బరస్ట్ అయిపోతాడు. అందుకే ఆయన మాటలకు వచ్చిన నవ్వును కష్టం మీద కంట్రోల్ చేసుకున్నారు.
ఈ చిత్ర టైటిల్ స్కంద కావడంతో… దాని మీద ఓ సంస్కృత పద్యం అందుకున్నాడు బాలయ్య. ఆ చెప్పే పద్యమో, శ్లోకమో స్పష్టంగా ఉంటే బాగుంటుంది. నాలుకకు తిరగని పదాలు నమిలేస్తూ కిచిడీ కిచిడీ చేశాడు. బాలయ్య వెనుకనే ఉన్న రామ్, శ్రీలీలకు నవ్వొచ్చేసింది. ఇది కెమెరాల్లో నమోదైంది. ఈ వీడియో వైరల్ అవుతుండగా మీమ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బాలయ్య స్పీచ్ ఎవరికైనా నవ్వు తెప్పిస్తుంది మరీ…
బాలయ్య ఏమైనా ప్రత్యేకంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎన్ని ఎదురైనా తన పంథా మాత్రం మార్చుకోడు. కొన్నాళ్లుగా పాటలు కూడా పాడుతున్నడు. ఘంటసాల వంటి గాన గంధర్వుడే అతి కష్టం మీద పాడిన ‘శివ శంకరీ’ సాంగ్ ని పాడి బాలయ్య సంగీత ప్రియుల మనోభావాలు దెబ్బతీశాడు. తన బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి పీడకల మిగిల్చాడు. అయితే ఒక విషయంలో బాలయ్యను మెచ్చుకోవాలి. ఏదైనా నా తర్వాతే అనుకుంటాడు. ఆత్మవిశ్వాసం టన్నుల్లో చూపిస్తాడు.
ఇక స్కంద విషయానికి వస్తే… దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. సెప్టెంబర్ 15న స్కంద వరల్డ్ వైడ్ విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్రైలర్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది.
View this post on Instagram