Politicians: రాజకీయ నేతలకూ ఫ్యాన్స్ ఉన్నారుగా?

Politicians: క్రికెట్ స్టార్లకు సినిమా హీరోలకే కాదు రాజకీయ నాయకులకు కూడా అభిమానులుంటారు. రాజకీయాలంటే అసహ్యంగా ఫీలయ్యే వారున్న నేటి రోజుల్లో రాజకీయ నేతలను కూడా తమ రోల్ మోడల్ గా ఎంచుకోవడం విచిత్రమే. ఇందులో భాగంగా తెలంగాణలో కేటీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు అభిమానులుండటం విశేషం. విచిత్రమేమిటంటే ఆంధ్ర నుంచి కేటీఆర్ కు తెలంగాణ నుంచి జగన్ కు జై కొడుతూ పాదయాత్రలు చేయడం కొసమెరుపు. రాజకీయాలంటూ దూషించడం నేతలను నిందించడం చూస్తుంటాం. […]

Written By: Srinivas, Updated On : December 22, 2021 7:55 pm
Follow us on

Politicians: క్రికెట్ స్టార్లకు సినిమా హీరోలకే కాదు రాజకీయ నాయకులకు కూడా అభిమానులుంటారు. రాజకీయాలంటే అసహ్యంగా ఫీలయ్యే వారున్న నేటి రోజుల్లో రాజకీయ నేతలను కూడా తమ రోల్ మోడల్ గా ఎంచుకోవడం విచిత్రమే. ఇందులో భాగంగా తెలంగాణలో కేటీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు అభిమానులుండటం విశేషం. విచిత్రమేమిటంటే ఆంధ్ర నుంచి కేటీఆర్ కు తెలంగాణ నుంచి జగన్ కు జై కొడుతూ పాదయాత్రలు చేయడం కొసమెరుపు.

Jagan KTR

రాజకీయాలంటూ దూషించడం నేతలను నిందించడం చూస్తుంటాం. కానీ జగన్, కేటీఆర్ ల సేవలు స్తుతిస్తూ వారి కోసం పాదయాత్రలు చేపట్టడం ఆశ్చర్యపరుస్తోంది. గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి పబ్బు కిషోర్ అనే అభిమాని జగన్ కోసం ఇక్కడి నుంచి పాదయాత్ర చేపట్టి తాడేపల్లి చేరుకోవడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడికి సాక్షి పత్రికలో గొప్పగా రాసి తమ ఘనతగా చెప్పుకున్నారు.

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న సేవలను గుర్తించి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సారథి గ్రామానికి చెందిన శేఖర్ అనే వీరాభిమాని అక్కడి నుంచి తెలంగాణకు పాదయాత్ర చేస్తున్నాడు. కేటీఆర్ అభివృద్ధి పనులతో దూసుకెళ్తుండటంతో ఆయనకు ప్రచారం చేసేందుకు నిర్ణయించుకుని కాలినడకన బయలు దేరాడు. దీంతో కేటీఆర్ కు కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారు.

Also Read: Exhibitors: ప్రభుత్వంతో ‘ఫైట్’కు సిద్ధమవుతున్న సినీ ఎగ్జిబిటర్లు..!

అభిమానం అంటే ఇంతలా ఉంటుందా అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. నేతల పనులతో వారికి పబ్లిసిటీ ఇస్తూ పనిలో పనిగా తమకు కూడా ప్రచారం కల్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు చాలా మంది గుండెపోటుతో మృతి చెందారని వార్తలు వచ్చాయి. కానీ అది వేరే విషయం. కానీ అభిమానమంటే భక్తిని చాటుకోవడమే అని తెలుస్తోంది.

Also Read: TRS: తాడో పేడో తేలేనా.. టీఆర్ఎస్ వ్యూహం ఫలించేనా?

Tags