Political Rewind 2025: కొన్ని గంటల్లో 2025 ముగియనుంది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా బీజేపీ జోరు కొనసాగింది. ఇక విపక్ష పార్టీలు బీజేపీకి దరిదాపులో కూడా లేవు. ఈ ఏడాది కూడా జాతీయ రాజకీయాల్లో బీజేపీ అఖండ ప్రాబల్యం చూపింది. కాంగ్రెస్ ఏరకంగానూ పోటీ ఇవ్వలేకపోయింది. బీహార్ ఎన్నికల్లో పూర్తి విజయం సాధించింది. దక్షిణాదిపై దృష్టిపెట్టింది.
తగ్గని మోదీ మేనియా
కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్రమోదీ ఎన్డీఏను అధికారంలోకి తెచ్చారు. దశాబ్దంగా పాలన సాగిస్తున్నా మోదీ మేనియా ఎక్కడ తగ్గడం లేదు. 300 సీట్ల ఎన్డీఏ ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతో ’ఒక దేశం–ఒక ఎన్నిక’ వంటి సంకల్పాలను అమలు చేస్తోంది. విదేశీ వేదికల్లో భారత్ స్థాయి ఎదగడం పార్టీకి బలమైన స్థానాన్ని కల్పించింది.
రాహుల్ వ్యూహాలు విఫలం..
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఓటరు మోసాలు, కుల లెక్కలపై దృష్టి పెట్టినా ఫలితాలు రాలేదు. ఈ వ్యూహాలు పనిచేయకపోగా బీజేపీకి అనుకూలంగా పనిచేశాయి. ప్రజల్లో మోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్‌ను చూడలేకపోవటం కాంగ్రెస్ స్థితిని బలహీనపరిచింది. రాహుల్ రాజకీయాలు పార్టీకి లాభం ఇవ్వకపోవటంతో ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ప్రజలతో సన్నిహిత సంబంధాలు లేకపోవటం, విభజన రాజకీయాలు కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టాయి.
ప్రాభవం కోల్పోతున్న ప్రాంతీయ పార్టీలు..
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది నిరాశలకు గురైంది. కేజ్రీవాల్ దూరంగా ఉండటం పార్టీ ప్రభావాన్ని తగ్గించింది. మమతా బెంగాల్ పరిమితమే, వామపక్షాలు కేరళపై ఆధారపడి లోకల్ ఎన్నికల్లోనే ఓడిపోయాయి. బీఎస్పీ దళిత ఓట్లను కోల్పోతోంది.
ప్రతిపక్షాలు ఏకతాటిపై పోరాడుతున్నాయి. జాతీయ పార్టీల బలహీనత, ప్రాంతీయ పార్టీల అసమర్థత బీజేపీకి మార్గం సుగమం చేస్తున్నాయి.