Toxic Movie Update: ‘కేజిఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుడు యాష్… కెజిఎఫ్ రెండు పార్టీలతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు మరో సినిమా చేయకుండా మంచి సబ్జెక్టు కోసం వేచి చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నాడు అంటూ పలు వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండడం విశేషం… కైరా అద్వానీ ఒకరు కాగా, నయనతార, హ్యూమ ఖురేషి లు సైతం నటిస్తుండటం విశేషం… ఇక వీళ్ళు ముగ్గురి పాత్రలకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ వాళ్ళ పోస్టర్లు రిలీజ్ చేశారు. కియారా అద్వానీ పేరు నదియా కాగా తన పోస్టర్ ఒక డిఫరెంట్ లుక్కునైతే తీసుకొచ్చింది. అలాగే ఖురేషీ పేరు ఎలిజబెత్… తన పేరుకు తగ్గట్టుగానే తన పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇక ఈరోజు నయనతార పోస్టర్ ను రిలీజ్ చేశారు…
ఇక ఈ పోస్టర్లలో కనక చూసినట్టయితే నయనతార పేరు గంగ అని ఉంది. అంటే ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. వాళ్ళ కమ్యూనిటీలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయనే విషయాన్ని వీళ్ళ పేర్లతోనే మనకు తెలియజేస్తున్నారు.
ఇక మొత్తానికైతే యాష్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమా తర్వాత అతనికి పెద్ద డైరెక్టర్ల నుంచి అవకాశాలైతే రాలేదు. దానివల్ల ఆయన చాలా సంవత్సరాల పాటు వెయిట్ చేసి మరి ఈ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో గొప్ప క్రేజ్ ను సంపాదిస్తే మరోసారి తన పేరు మారు మ్రోగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణంలో కూడా ఆయన రావణాసురుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్రతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. రావణాసురుడి పాత్రలో తన విలనిజాన్ని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది…