Sunita Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టిడిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ(బెయిల్ వచ్చింది).. ఇంకా చాలామంది ఢిల్లీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి ఒకసారి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. కోర్టు ఆదేశాలతో మళ్ళీ జైలుకు వెళ్లారు. ఇక కవితకు కోర్టు అసలు బెయిల్ ఇవ్వడం కుదరదని చెబుతోంది. ఈడీ కూడా వరుసగా చార్జ్ షీట్లు దాఖలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రివాల్ కు బాసటగా ఆమె సతీమణి సునీతా కేజ్రీవాల్ నిలిచింది. ఇదే సమయంలో ఒక వీడియో సందేశం విడుదల చేసింది. అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో అరవింద్ కేజ్రివాల్ అరెస్టు వెనుక సంచలన విషయాలు వెలుగు చూశాయి.
ఢిల్లీలో తన కుటుంబం పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సునీత భావించారు. భూ కేటాయింపు కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను కలిశారు. అయితే ఈ విషయాన్ని మార్చి 16 , 2021లో ఈడీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆ తర్వాత మద్యం కుంభకోణం విషయంలో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్టయ్యాడు. ఆ తర్వాత జైలుకు వెళ్లాడు. అతడు జైలుకు వెళ్లిన తర్వాత మా గుంట శ్రీనివాసులు రెడ్డి మాట మార్చారని సునీత ఆరోపిస్తున్నారు. చాలామంది ముందు తనను లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టమని.. అరవింద్ కేజ్రివాల్ కోరారని.. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని శ్రీనివాసులు రెడ్డి జూలై 17, 2023లో ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఇదే విషయాన్ని సునీత తప్పుపడుతున్నారు. “అంతమంది ముందు డబ్బులు ఎలా అడుగుతారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా డబ్బులు అడగడం సాధ్యమేనా? ఇలాంటి లోపభూయిష్టమైన విషయాలు ఈ కేసులో చాలా ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈడీ నా భర్తను వేధిస్తోందని” సునీత ఆరోపిస్తున్నారు.
మాగుంట ఈడి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన కుమారుడు రాఘవకు బెయిల్ లభించిందని సునీత ఆరోపిస్తున్నారు.. ఎంపీ మాట మార్చడంతోనే ఆయన కుమారుడికి బెయిల్ వచ్చిందని.. ఇదే సమయంలో తన భర్త అరవింద్ కేజ్రివాల్ జైలు పాలయ్యారని ఆరోపించారు. ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్, ఆప్ పార్టీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అణగ దక్కుతున్నారని సునీత ఆరోపిస్తున్నారు. “అరవింద్ ఎలాంటి తప్పులూ చేయలేదు. ఆయన నిజాయితీ గల వ్యక్తి. ఆయనకు మద్దతు ఇవ్వకపోతే చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టపడరని” సునీత వ్యాఖ్యానించారు.
ఇక సునీత విడుదల చేసిన వీడియోపై బిజెపి విమర్శలు మొదలు పెట్టింది. ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం లో పీకల్లో కూరుకుపోయారని.. ఆయన బయటికి రావడం కష్టమని చెబుతున్నారు. కానీ ఇలాంటి సమయంలోనే న్యాయవ్యవస్థ పనితీరును శంకించే విధంగా సునీత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంటున్నారు. కాగా, ఆదివారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మెడికల్ రికార్డులను పరిశీలించేందుకు ఆయన తరఫున వైద్యులను సంప్రదించేందుకు శ్వేతకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. వైద్య పరీక్షలు నేపథ్యంలో తన భార్యను అనుమతించాలని అరవింద్ కోర్టును కోరడంతో తిరస్కరించింది.. ప్రస్తుతం అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీలోని తీహాడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Political conspiracy behind arvind kejriwal arrest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com