Policy Terrorism: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగుతోంది. జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారింది పరిస్థితి. పోసాని కృష్ణ మురళి పవన్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో సవాళ్లు విసురుతున్నారు. వైసీపీ నేతల రాద్ధాంతంతో పవన్ కల్యాణ్ సైతం రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల వ్యవహారం రాష్ర్టంలో చర్చనీయాంశం అవుతోంది.

ఈ నేపథ్యంలో పాలసీ టెర్రరిజం పదాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెరమీదకు తెచ్చారు. వైసీపీ నేతల్లో సంయమనం కొరవడుతోందని విమర్శించారు. ఆవేశంతో ఊగిపోతూ దుర్భాషలాడుతూ జనసేనపై కాలు దువ్వుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని పవన్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. పాలసీ టెర్రరిజంతో సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ నినాదం తెచ్చారు. దీంతో ఇరు పార్టీల్లో అభిప్రాయ భేదాలు పెరిగిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయి. మద్యం ఏరులై పారుతోంది. పన్నులు పెరిగిపోతున్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శిస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ర్టంలో ఆలయాలపై జరిగే దాడులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరుపై పవన్ కల్యాణ్ పలు కోణాల్లో ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై దాడులు చేస్తారా అని అడిగారు. వైసీపీ నేతల్లో ఆగ్రహావేశాలు తగ్గించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.
రెండున్నరేళ్ల కాలంగా ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ చులకన అవుతోందని దుయ్యబట్టారు. వైసీపీ మంత్రులు రెచ్చిపయి మాట్లాడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు అసలు వారు మంత్రులేనా? ఇంతలా తగ్గిపోయి మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. రాజకీయాల్లో హుందాగా ఉండే వారే నాయకులని ఇలా అన్నింటికి రెచ్చిపోతే పిచ్చివారుగా చూస్తారని ఎద్దేవా చేశారు. పాలసీ టెర్రరిజం గురించి వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.