Luxury Naxalites: అడవుల్లో ఉంటూ తుపాకీ చేతపట్టి.. ప్రభుత్వాలపై పోరాటాలు జరిపే నక్సలైట్లు అత్యంత నిరాడంబరమైన జీవితం గడుపుతుంటారని అందరికీ తెలుసు. నిజానికి అలానే నక్సలైట్లు ఉంటుంటారు కూడా. కానీ, ఇటీవల పోలీసులకు చిక్కిన నక్సలైట్లు మాత్రం అలా కాదండోయ్… వారు కూడా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తున్నారు. ఇంతకీ వారి వద్ద లభించిన కారు ఎంత ఖరీదైందో తెలుసా.. ఆ కారు చూసి పోలీసులు బిత్తరపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సదరు నక్సలైట్ల వివరాల్లోకెళితే.. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఓ హోటల్ లో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. దాంతో రాంచీ సీనియర్ ఎస్పీ సురేంద్ర ఝా ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది కలిసి హోటల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలోనే హోటల్‌ను చుట్టుముట్టి నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నక్సలైట్లు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్‌ను చూసి మాత్రం పోలీసులు బిత్తరపోయారు.
రూ.50 లక్షలు విలువైన బీఎం డబ్ల్యూ కారును నక్సలైట్లు మెయింటేన్ చేస్తున్నారు. అమీర్‌చంద్ కుమార్, ఆర్య కుమార్ సింగ్, ఉజ్వల్ కుమార్ సాహు అనే ముగ్గురు నక్సల్స్.. పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) దళానికి చెందిన సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద బీఎండబ్ల్యూ కారుతో పాటు రూ.17 లక్షల విలువైన థార్.. డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నక్సల్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు..వారి నుంచి 12 కార్లతో పాటు రూ.3.5 లక్షల నగదు, 5 సిమ్ కార్డులు, టెంట్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
నక్సలైట్లు జనజీవనంలో ఉంటుండగా, వీరికి.. నివేష్ కుమార్, ధువర్ సింగ్, శుభమ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు సాయం చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. నక్సలైట్లకు సహకరించిన ఆ ముగ్గురి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పీఎల్ఎఫ్ఐ దళానికి చెందిన ఈ నక్సలైట్లు ప్రముఖులు, సంపన్నులను బెదరించి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.
Also Read: Modi: లాక్ డౌన్ దిశగా మోడీ అడుగులు?
ఇకపోతే వీరి వద్ద లభించిన కార్ల నెంబర్ ప్లేట్ల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. పంజాబ్, బిహార్, జార్ఖండ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్స్ ఉండగా, ఆయా రాష్ట్రాలలో సంపన్నులను వీరు బెదిరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
Also Read: Rajasthan Woman: బాయ్ ఫ్రెండ్ కోసం పాకిస్తాన్ వెళ్లాలనుకున్న రాజస్థాన్ వివాహిత అంత పనిచేసింది?