Homeఎంటర్టైన్మెంట్Rakul Preet Singh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడంటే?

Rakul Preet Singh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎప్పుడంటే?

Rakul Preet Singh Marriage: టాలీవుడ్లోని టాప్ గ్లామరస్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. రకుల్ ప్రీత్ సింగ్ కొద్దిరోజుల క్రితమే తన లవర్ ను అభిమానులను పరిచయం చేసింది. ఇదే పెళ్లిపై రూమర్లకు కారణమవుతోందని తెలుస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ తమ తెలుకుండానే ఇంత వ్యవహరం ఎలా నడిపిందబ్బా? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఉన్న ప్రేమాయణాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకునే దాకా ఈ విషయం ఎవరికీ తెలియదు.  గతేడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే సందర్భంగా జాకీ భగ్నానీ తనకు ప్రపోజ్ చేశాడని అందుకు తాను అంగీకరించినట్లు తెలిపింది రకుల్.

వీరిద్దరి లవ్ మ్యాటర్ బయటికి రివీల్ కావడంతో ఇద్దరు ఎంచక్కా షికార్లు, డేటింగ్, సంథింగ్.. సంథింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో త్వరలోనే రకుల్ పెళ్లి పీఠలెక్కబోతుందనే వార్తలకు బలం చేకూరింది. రకుల్ పెళ్లిపై రోజుకో వార్త వస్తుండటంతో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం తాను సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నానని.. అసలు పెళ్లి గురించి ఆలోచించే టైమ్ కూడా లేదని స్పష్టం చేసింది.

సినిమాలతో బీజీగా ఉన్న సమయంలో పెళ్లి రూమర్స్ క్రియేట్ చేయద్దని విజ్ఞప్తి చేసింది. తన ప్రేమను ఎలాగైతే అభిమానులతో పంచుకున్నానో..  అలాగేపెళ్లి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటానని.. ఇందులో దాచుకోవాల్సిన విషయం ఏమిలేదని పేర్కొంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ కూడా అచ్చం తనలాగే ఆలోచిస్తాడని చెబుతూ రకుల్ మురిసిపోతోంది.

ఉదయాన్నే ఇద్దరు కలిసి జిమ్ చేస్తామని.. ఆరోగ్యకమైర ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతామని చెప్పింది. తమ ఇద్దరి ఫ్యామిలీస్ తమకు ఒకేలా ప్రాధాన్యం ఇవ్వడం నచ్చుతుందని తెలిపింది. ఈ కామన్ అంశాలే తమను ఒకటిగా కలిపినట్లు రకుల్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో దాదాపు 10 సినిమాలున్నాయి. ఇందులో బాలీవుడ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular